నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ రిలీజ్ అప్పుడేనా? రాబిన్‌హుడ్ డిజాస్ట‌ర్‌తో మారిన ప్లాన్‌-hero nithin thammudu release date a consequence of robinhoods box office performance know the details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ రిలీజ్ అప్పుడేనా? రాబిన్‌హుడ్ డిజాస్ట‌ర్‌తో మారిన ప్లాన్‌

నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ రిలీజ్ అప్పుడేనా? రాబిన్‌హుడ్ డిజాస్ట‌ర్‌తో మారిన ప్లాన్‌

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరో నితిన్ జాగ్రత్త పడుతున్నాడు. కొత్త సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ప్లాన్ ఛేంజ్ చేశాడు. అతని న్యూ మూవీ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.

నితిన్ కొత్త సినిమా తమ్ముడు (instagram)

నితిన్ కొత్త మూవీ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ లేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫిల్మ్ ను జులై 4న విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రేపోమాపో మేకర్స్ నుంచి ప్రకటన వచ్చే అవకాశముంది.

ఎప్పుడో రావాల్సింది

నిజానికి ‘తమ్ముడు’ సినిమాను ఈ ఏడాది మహా శివరాత్రికే రిలీజ్ చేయాలని అనుకున్నారు. రిలీజ్ పోస్టర్ కూడా పోస్టు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఇంతలో రాబిన్ హుడ్ మూవీ వచ్చేసింది. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది. నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ, కామెడీ ఇలా ఏదీ వర్కౌట్ కాలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ తో నితిన్, అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

అందుకే లేట్ గా

ఇలాంటి టైమ్ లో వెంటనే ‘తమ్ముడు’ మూవీని రిలీజ్ చేస్తే రాబిన్ హుడ్ ఇంపాక్ట్ ఈ ఫిల్మ్ మీద పడే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే మేలని నితిన్, మేకర్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజీలో ఉన్న ఈ మూవీ త్వరలోనే రెడీ కాబోతుంది. అయినా జులై వరకు వేచి చూడాలనే నిర్ణయం తీసుకున్నారు.

అప్పటిలోపు టైమ్ ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా రాబిన్ హుడ్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ‘తమ్ముడు’ మూవీ ప్రమోషన్స్ గట్టిగా చేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు.

నిలబెట్టేనా?

నితిన్ వరుసగా ఫ్లాప్ లు చూస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స‌ట్రార్డిన‌రీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా వరుస ఫెయిల్యూర్స్ తో నితిన్ కెరీర్ సాగుతోంది. ఇప్పుడు కానీ ఓ హిట్ పడకపోతే అంతే సంగతి. అందుకే తన ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ టైటిల్ ‘తమ్ముడు’ మూవీపై నితిన్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు.

‘తమ్ముడు’ మూవీకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ మూవీగా ఇది రెడీ అవుతోందని టాక్. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ వరుసగా చేస్తున్న రెండో సినిమా ఇది. ‘వకీల్ సాబ్’ లాంటి హిట్ తర్వాత ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ కు అక్కగా సీనియర్ నటి లయ నటించింది. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం