Hero Nithin: ఆరోజు అందరికీ హాలీడే ఇవ్వాలని కోరుతున్నాను.. హీరో నితిన్ కామెంట్స్-hero nithin comments on robinhood movie in srkr college event at bhimavaram and request to give holiday on march 28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Nithin: ఆరోజు అందరికీ హాలీడే ఇవ్వాలని కోరుతున్నాను.. హీరో నితిన్ కామెంట్స్

Hero Nithin: ఆరోజు అందరికీ హాలీడే ఇవ్వాలని కోరుతున్నాను.. హీరో నితిన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Nithin About Robinhood In Bhimavaram SRKR College: హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆరోజు అందరికీ హాలీడే ఇవ్వాలని కోరుతున్నాను.. హీరో నితిన్ కామెంట్స్

Nithin Request To Give Holiday: హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ రాబిన్‌హుడ్. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అలాగే, ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈవెంట్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్ (SRKR) ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. "హాయ్ SRKR. మార్చి 28న అందరికీ హాలీడే ఇవ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను (నవ్వుతూ). లేదంటే అందరూ మాస్ బంక్ కొట్టండి. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మా రవి గారు చదువుకున్న కాలేజ్. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ రాబిన్‌హుడ్ సినిమా చూడండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అందరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు.

మూడు రకాల స్టూడెంట్స్ ఉంటారు

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. "మార్చి 28న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చదువుకునే సమయంలో మంచి బ్రేక్ కోసం చూసే సినిమా ఇది. అందరికీ థాంక్ యూ" అని ముగిచింది.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. "మా సినిమా నుంచి వేర్ ఎవర్ యు గో, వన్ మోర్ టైం, అది దా సర్‌ప్రైజ్ మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు పాటల్లానే ప్రతి కాలేజ్‌లో మూడు రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్లు బాగా చదివి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అన్నట్లుగా జాబ్స్ కొట్టేశారు" అని అన్నారు.

ఈ కాలేజ్ ప్రోడక్ట్ అని

"రెండో క్యాటగిరీ వన్ మోర్ టైం అంటూ బ్యాక్ లాగ్స్ రాస్తుంటారు. రవి గారు లాగా మూడో క్యాటగిరీ. ఆయన ఇంజినీరింగ్ చదివి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఏది చేసిన హార్ట్‌ఫుల్‌గా చేయండి. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. రాబిన్‌హుడ్ కూడా హార్ట్‌ఫుల్‌గా చేశాం. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థాంక్ యూ" అని వెంకీ కుడుముల తెలిపారు.

ప్రొడ్యూసర్ వై రవి శంకర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నేను ఈ కాలేజ్ ప్రోడక్ట్‌ని అని చెప్పులోవడం చాలా ఆనందంగా ఉంటుంది. నా క్లాస్‌మేట్స్, టీచర్స్ అందరికీ థాంక్ యూ. రాబిన్‌హుడ్ సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 28న సినిమాకి వెళ్లండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. నితిన్ గారికి, శ్రీలీల గారికి, డైరెక్టర్ వెంకీకి థాంక్ యూ" అని చెప్పారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం