ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్-hero naveen chandra comments on eleven movie concept twist and turn in media interview says different emotional concept ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్

ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 16న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో లెవెన్ సినీ విశేషాలను విలేకరుల సమావేశంలో పంచుకున్నాడు హీరో నవీన్ చంద్ర.

ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్

నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ లెవెన్ సినిమాకు దర్శకత్వం వహించారు.

విమర్శకుల ప్రశంసలు

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి సినిమా విజయం తర్వాత వస్తున్న మూడో సినిమా. లెవెన్ సినిమా ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది.

మే 16న లెవెన్ రిలీజ్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న లెవెన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సినిమాకి లెవన్ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

-అది కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తమిళ్‌లో షోస్ జరిగాయి. యునానిమాస్ ‌గా సూపర్ రెస్పాన్స్. చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

-మేము అనుకున్న ట్విస్ట్‌లు, టర్న్స్, అడ్రినల్ రష్ మూమెంట్స్ ప్రేక్షకులని ఎగ్జయిట్ చేశాయి. ఆడియన్స్ రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ దొరికింది.

ఈ థ్రిల్లర్ ఎంత కొత్తగా ఉండబోతోంది?

-ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్‌లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది. ఆడియన్స్‌కి చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ‌ని ముందుగా డీకోడ్ (కనిపెట్టడం) చేయడం కష్టం.

స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోంది? డైరెక్టర్ లోకేష్ గురించి ?

-మంచి రైటింగ్ బలం ఉన్న సినిమా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు సినిమా ప్రీ ప్రొడక్షన్ చేశాం. లెవన్ చూస్తున్నపుడు విజువల్‌గా ఓ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నిర్మాతలు చాలా ఖర్చు చేశారు. ఇది డైరెక్టర్, టెక్నికల్ ఫిల్మ్.

- లోకేష్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన వారంతా డైరెక్టర్ గురించి, రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం