హిట్ 3 రిలీజ్ కు ముందు భయపడుతున్న నాని.. మారిపోతానేమోనంటూ కామెంట్లు.. రీజన్ ఇదే!-hero nani feared about fame may changes him hit 3 release srinidhi shetty tollywood new movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3 రిలీజ్ కు ముందు భయపడుతున్న నాని.. మారిపోతానేమోనంటూ కామెంట్లు.. రీజన్ ఇదే!

హిట్ 3 రిలీజ్ కు ముందు భయపడుతున్న నాని.. మారిపోతానేమోనంటూ కామెంట్లు.. రీజన్ ఇదే!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కొత్త మూవీ హిట్ 3 రిలీజ్ కు రెడీగా ఉంది. మరొక్క రోజులోనే థియేటర్లకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఫేమ్, భయం గురించి మాట్లాడాడు.

హీరో నాని

వరుస హిట్లతో దూసుకెళ్లున్నాడు నేచురల్ స్టార్ నాని. ఒక్కో సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇప్పుడు హిట్ 3తో ఓ లెవల్ యాక్షన్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఈ మూవీ రేపే (మే 1) రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో నాని బిజీగా గడిపేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఆ భయం

శ్రీనిధి శెట్టితో కలిసి నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు హీరో నాని. రీసెంట్ గా బాలీవుడ్ బబుల్తో మాట్లాడుతూ.. తన కెరీర్, ఫేమ్, భయం గురించి నాని మాట్లాడాడు. సినిమాల కారణంగా వచ్చే ఫేమస్ ను చూసి భయపడ్డానని నాని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అలా ఫేమస్ అయితే పర్సన్ గా ఛేంజ్ అవుతానని భయపడ్డానని నాని వెల్లడించాడు.

ఎలాంటి ఆందోళన లేదు

2008లో వచ్చిన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేయడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని దర్శకుడిగా మారాలనుకున్నాడు. నటుడిగా వచ్చే కీర్తి తనను మారుస్తుందని ఒకప్పుడు భయపడ్డానని అతను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘సినిమాలతో వచ్చే ఫేమ్ నన్ను మారుస్తుందేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కెరీర్ నాకు నేర్పింది. చాలా మంది అంటుంటారు కదా ఫేమ్ వస్తే మారిపోతారని. నా కెరీర్ స్టార్టింగ్ లో నేను కూటా భయపడ్డా. నన్ను ఫేమ్ మార్చేస్తుందేమో అనుకున్నా. నా నుంచి నన్నే దూరం చేస్తుందేమోనని భయపడ్డా’’ అని నాని పేర్కొన్నాడు.

ఎంతో మందిని చూశా

తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మారడం చూసి తనకు భయమేసిందని నాని అన్నాడు. ‘‘కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం చూశా. కానీ కొన్నేళ్లుగా నా విషయంలో ఫేమ్ ఏం చేయలేకపోయింది. మారడం అనేది నీలోనే ఉంటుంది. ఫేమ్ అందుకు కారణం కాదు. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఫేమస్ కావడానికి ముందు అతను మంచి వ్యక్తిగా ఉండేవాడనే మాటలు వస్తూనే ఉంటాయి.

కానీ అది నిజం కాదు. అతను చాలా బాగా నటించాడు అంతే. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఫేమ్ కారణంగా ఏమీ మారదు. నాకు అదే అర్థమైంది’’ అని నాని తెలిపాడు.

హిట్ గురించి: ది థర్డ్ కేస్

నాని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హిట్: ది థర్డ్ కేస్ ను నిర్మించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన హిట్ ఫ్రాంచైజీలో మూడవది. మొదటి, రెండో భాగాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ మిస్టరీ హత్యలను ఛేదించే పోలీసులగా నటించారు. మూడో భాగంలో నాని రహస్యంగా వెళ్లి ఓ బిడ్డను కాపాడి వరుస హత్యలను పరిష్కరిస్తాడు. సెన్సార్ బోర్డు 'ఎ' రేటింగ్ ఇచ్చిన ఈ హిట్ 3 మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం