పాకిస్తాన్‌కు ఆ సంతృప్తిని కూడా మిగల్చకూడదనే సెలబ్రేషన్స్.. ఏం టచ్ చేయలేకపోయారని చెప్పడానికే.. హీరో నాని కామెంట్స్-hero nani comments on pakistan india war in hit 3 movie success meet says not giving satisfaction to pak ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పాకిస్తాన్‌కు ఆ సంతృప్తిని కూడా మిగల్చకూడదనే సెలబ్రేషన్స్.. ఏం టచ్ చేయలేకపోయారని చెప్పడానికే.. హీరో నాని కామెంట్స్

పాకిస్తాన్‌కు ఆ సంతృప్తిని కూడా మిగల్చకూడదనే సెలబ్రేషన్స్.. ఏం టచ్ చేయలేకపోయారని చెప్పడానికే.. హీరో నాని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

పాకిస్తాన్‌పై హీరో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హిట్ 3 సక్సెస్ మీట్‌లో ఇండియాను ఏం చేయలేకపోయారనే స్టేట్‌మెంట్ పాస్ చేయడానికి, వారి వల్ల ఇండియాలో సెలబ్రేషన్స్ ఆగిపోయాయన్న సంతృప్తి వారికి ఇవ్వొద్దన్న ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్స్ అని నాని చెప్పుకొచ్చాడు.

పాకిస్తాన్‌కు ఆ సంతృప్తిని కూడా మిగల్చకూడదనే సెలబ్రేషన్స్.. ఏం టచ్ చేయలేకపోయారని చెప్పడానికే.. హీరో నాని కామెంట్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా హిట్ ది థర్డ్ కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మూవీ మే 1న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ 3 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి

సక్సెస్ మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు దేశంలో పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది" అని అన్నాడు.

ఒక సంతృప్తి కూడా

"వాళ్లు (పాకిస్తాన్) చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయిందని ఒక సంతృప్తి కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మనల్ని ఏమీ చేయలేకపోయారని, ఏం టచ్ చేయలేకపోయారనే స్టేట్‌మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీమ్ తరఫునుంచి ఏ బిగ్ సెల్యూట్" అని నాని చెప్పుకొచ్చాడు.

బిగ్ మాస్ కమర్షియల్ సినిమాగా

"హిట్ 3 సినిమా విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను. కానీ, ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అద్భుతంగా అనిపించింది" అని నాని తెలిపాడు.

ఆయనతో నాలుగో సినిమా

"ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు అన్‌బిలీవబుల్ సెట్స్ వేశారు. డిఓపి సాను గారు నా ఫేవరెట్. ఆయనతో నాది 4వ సినిమా. కథ చెప్పడానికి ఆయన బిగ్ స్ట్రెంత్. మిక్కీ సినిమాకి ఒక కొత్త టోన్ సెట్ చేసిన సౌండింగ్ ఇచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యు" అని నాని పేర్కొన్నాడు.

భారత్-పాక్ యుద్ధం

ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. కాశ్మీర్‌లోని పహాల్గామ్‌లో హిందూ టూరిస్ట్‌లపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఈ వార్‌కు బీజం పడింది. ప్రస్తుతం పాకిస్థాన్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.

ఆంక్షల ఉల్లంఘన

ఇక కాల్పుల విరమణకు చర్చలు సఫలం అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, రాత్రి సమయంలో ఆంక్షలు ఉల్లంఘించి, విరమణ ఒప్పందమైన గంటకే పాక్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాక్‌ పన్నాగాన్ని తిప్పికొట్టాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం