Nani: కామెడీ సినిమా తీస్తాడనుకున్నా.. కానీ ఎమోషనల్ చేశాడు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్-hero nani comments on dhanraj in samuthirakani ramam raghavam movie trailer launch and dhanraj samuthirakani speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: కామెడీ సినిమా తీస్తాడనుకున్నా.. కానీ ఎమోషనల్ చేశాడు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nani: కామెడీ సినిమా తీస్తాడనుకున్నా.. కానీ ఎమోషనల్ చేశాడు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 15, 2025 10:15 AM IST

Nani Comments On Dhanraj Ramam Raghavam In Trailer Launch: జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తండ్రీకొడుకుల కథా చిత్రం రామం రాఘవం. తాజాగా రామం రాఘవం మూవీ ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరు అయిన నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కామెడీ సినిమా తీస్తాడనుకున్నా.. కానీ ఎమోషనల్ చేశాడు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్
కామెడీ సినిమా తీస్తాడనుకున్నా.. కానీ ఎమోషనల్ చేశాడు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nani Comments On Dhanraj Ramam Raghavam In Trailer Launch: జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు ధన్‌రాజ్. నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన ధన్‌రాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ధన్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామం రాఘవం.

నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై ప్రభాకర్‌ అరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మాతగా వ్యవహరించిన ద్విభాషా చిత్రమే రామం రాఘవం. ఇందులో సముద్రఖని ప్రధానపాత్రలో నటించాడు. తాజాగా రామం రాఘవం మూవీ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. రామం రాఘవం ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కెరీర్ మొదటి నుంచి

హీరో నాని మాట్లాడుతూ.. "రామం రాఘవం ట్రైలర్‌ను నా చేతులమీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ధన్‌రాజ్‌ నాకు కెరీర్‌ మొదటి నుంచి పరిచయం. అప్పుడే అతని టాలెంట్‌ రేంజ్‌ ఏంటో నాకు తెలుసు. అందుకే రామం రాఘవం సినిమాని ధన్‌రాజ్‌ దర్శకత్వం వహించాడంటే నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు" అని అన్నాడు.

వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం

"కానీ, ధన్‌రాజ్‌ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్న నన్ను రామం రాఘవం ట్రైలర్‌ చూపించి ఎమోషనల్‌ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడు. సముద్రఖని అన్న వర్క్‌ అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టం. ఆయన నేను ఫ్యామిలీలా ఉంటాము. నిర్మాత పృథ్వీ పోలవరపు మంచి కంటెంట్‌ ఉన్న సినిమాని నిర్మించటం మంచి విషయం" అని నాని తెలిపాడు.

ఒకే ఒక లోకం నువ్వు

"శశి సినిమాలో ఒకే ఒక లోకం నువ్వు పాట నాకు ఎంతో ఇష్టం. ఆ సినిమాకి సంగీతాన్నిచ్చిన అరుణ్‌ చిలివేరు రామం రాఘవం సినిమాకు చక్కని సంగీతాన్ని ఇచ్చారని ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. టీమ్ అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ 21వ తేది కోసం ఎదురు చూస్తున్నా" అని హీరో నాని తన స్పీచ్ ముగించాడు.

తమ్ముడు లాంటి నాని

నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. "నా సొంత తమ్ముడు లాంటి నాని రామం రాఘవం ట్రైలర్‌ లాంచ్‌ చేయటం సంతోషంగా ఉంది. ధన్‌‌రాజు దర్శకత్వంలో ఫిబ్రవరి 21న వస్తున్న మా సినిమాని థియేటర్‌లో చూసి నన్ను మా టీమ్‌ని ఆశీర్వదించండి" అని చెప్పుకొచ్చారు.

అడగ్గానే ట్రైలర్ లాంచ్

"ఈ రోజు నాని గారు దర్శకునిగా నా మొదటి సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేయటం హ్యాపీగా ఉంది. అడగ్గనే మా ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన నాని గారికి కృతజ్ఞతలు. ఫాదర్‌-సన్‌ ఎమోషనల్‌ డ్రామాలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయని యూనిక్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని డైరెక్టర్ ధన్‌రాజ్ తెలిపాడు.

కంటెంట్ ఫుల్‌గా ఉన్న

"కంటెంట్‌ ఫుల్‌గా ఉన్న మా సినిమా ట్రైలర్‌ను నాని గారు విడుదల చేయటంతో మా సినిమా టీమ్‌కి మరింత ఉత్సాహాన్నిచ్చింది" అని నిర్మాత పృథ్వీ పోలవరపు చెప్పుకొచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో నటి ప్రమోదిని, సంగీత దర్శకుడు అరుణ్‌ చిలివేరు తదితరులు పాల్గొన్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం