నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే కోర్ట్ మూవీతో ప్రొడ్యూసర్‌గా సాలిడ్ హిట్ అందుకున్న నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంఛైజీలో వస్తోన్న మూడో సినిమా హిట్ 3కి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
హిట్ 3 మూవీ మే 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల ఇంట్రాగేషన్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు హీరో నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు.
"తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయిన ఉంటే 70ఎంఎం స్క్రీన్‌పైన ఉండాలి. లేదా 40 ఫీట్ ప్రీ రిలీజ్ స్టేజ్ మీద ఉండాలి. కాదు కూడదు అని ఇలా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటే మేము ఇంట్రాగేషన్‌కు వచ్చేస్తాం" అని యాంకర్ సుమ అన్నారు. "ఆర్జే, ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్), హీరో, ప్రొడ్యూసర్, అసలు ఎవరు మీరు" అని యాంకర్ సుమ అడిగారు. అప్పుడు ట్రైలర్‌లోని నాని డైలాగ్ చూపించారు.
"ఇంతకు మించి వెళ్లేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా.. అంటే డైరెక్షన్" అని యాంకర్ సుమ అంటే.. "మీకు చూపిస్తా. నా ఒరిజినల్" అని మరోసారి హిట్ 3 ట్రైలర్ డైలాగ్ చూపించారు. "హిట్ 3నే ఇంత వయోలెంట్‌గా ఉంటే ట్రైలర్.. ఇక ప్యారడైజ్ మ్యాడ్‌నెస్‌కు మ్యాగ్జిమం లాగా కనిపిస్తుంది అంటున్నారు. నిజమేనా" అని సుమ కనకాల అంటే.. "అది ఒక యాక్షన్ డ్రామా అది" అని నాని చెప్పాడు.
"యంగర్ హీరోస్‌కి మీరు ఏదైనా సలహా ఇస్తే ఏమిస్తారు" అన్నదానికి "పేషన్స్ (ఓపిక)" అని నాని సమాధానం ఇచ్చాడు. "మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్" అని యాంకర్ సుమ అంటే.. "నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎక్స్‌ట్రీమ్‌లి చాలా స్పెషల్ నాకు. నాలుగు వేలు నా మొదటి జీతం. నాకు వచ్చినది" అని హీరో నాని తెలిపాడు.
తర్వాత తమకు వచ్చిన కామెంట్స్ ప్రశ్నలను నానికి చెప్పి అడిగారు. "నాని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ గోడ కడుతున్నాను అని. ఆ గోడ ఎంతవరకు వచ్చిందో నాని గారిని అడగండి" అని ఒకరి క్వశ్చన్‌ను యాంకర్ సుమ అడిగారు. దానికి నానితోపాటు సుమ కూడా నవ్వారు. తర్వాత ఒక అభిమాని హిట్ 3 ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసింది యాంకర్ సుమ చెప్పారు. "టెంపర్‌గా చెప్పేశాడు" అని నాని అన్నాడు.
"మీకేంటీ ఇంత గుండె ధైర్యం. బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు వచ్చి ఇంత స్ట్రాంగ్‌గా సెటిల్ అయ్యారు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆ గుండె ధైర్యం" అని యాంకర్ సుమ అడిగారు. "నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట" అని మరోసారి హిట్ 3 ట్రైలర్‌లోని నాని డైలాగ్‌తో యాంకర్ సుమ ఇంటర్వ్యూ ప్రోమోను ఎండే చేశారు.
సంబంధిత కథనం