Nani 30th Movie Title: హీరో నానిని నాన్న అని పిలిచిన మృణాల్ ఠాకూర్ - హాయ్ నాన్న వీడియో గ్లింప్స్‌ రిలీజ్‌-hero nani 30th movie title unveiled nani mrunal thakur movie titled hi nanna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hero Nani 30th Movie Title Unveiled Nani Mrunal Thakur Movie Titled Hi Nanna

Nani 30th Movie Title: హీరో నానిని నాన్న అని పిలిచిన మృణాల్ ఠాకూర్ - హాయ్ నాన్న వీడియో గ్లింప్స్‌ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jul 13, 2023 11:36 AM IST

Nani 30th Novie Title: నాని హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా టైటిల్‌ను గురువారం రివీల్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఏదంటే…

నాని హాయ్ నాన్న
నాని హాయ్ నాన్న

Nani 30th Novie Title: ద‌స‌రా స‌క్సెస్ త‌ర్వాత త‌న రూట్ మార్చిన నాని ఫ్యామిలీ జోన‌ర్‌లో ఓ మూవీ చేస్తోన్నాడు. అత‌డు హీరోగా న‌టిస్తోన్న ఈ కొత్త సినిమా టైటిల్‌ను గురువారం రివీల్ చేశారు. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే పేరును ఫిక్స్ చేశారు. ఓ వీడియో గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైటిల్‌ను మూవీ టీమ్ అనౌన్స్‌చేసింది . ఈ వీడియో గ్లింప్స్ చూస్తుంటే తండ్రీకూతుళ్లు అనుబంధం నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

మీట్ య‌శ్న.. మై ఫ్రెండ్ అంటూ ఓ చిన్నారి మృణాల్ ఠాకూర్‌ను (Mrunal Thakur) ప‌రిచ‌యం చేయ‌డం వీడియోలో ఆక‌ట్టుకుంటోంది. ఆ త‌ర్వాత మా నాన్న అంటూ ఆ చిన్నారి వాయిస్ వినిపించ‌గానే నాని వీడియోలో స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ త‌ర్వాత మృణాల్ ఠాకూర్ కూడా నానిని హాయ్ నాన్న అంటూ ప‌ల‌క‌రించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. మెలోడియ‌స్‌గా వినిపిస్తోన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియో గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.

హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి (Tollywood) ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. హాయ్ నాన్న మూవీ టైటిల్‌ను ట్విట్ట‌ర్ ద్వారా డిఫ‌రెంట్‌గా రివీల్ చేశాడు హీరో నాని. హాయ్ నాన్న అని ఆమె న‌న్ను పిలుస్తుంది. కానీ చిన్నారి కాదు అంటూ స‌స్పెన్స్ క్రియేట్ చేశారు.

హాయ్ నాన్న మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు హీష‌బ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.సీతారామం త‌ర్వాత తెలుగులో మృణాల్ ఠాకూర్ న‌టిస్తోన్న సినిమా ఇది. డిసెంబ‌ర్‌లో హాయ్ నాన్న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. నాని హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.