Drinker Sai: హీరోగానే బతుకుతా.. హీరోగానే చచ్చిపోతా.. ప్రభాస్ మనస్ఫూర్తిగా చెప్పారు.. డ్రింకర్ సాయి హీరో ధర్మ కామెంట్స్
Dharma About Prabhas Wishes In Drinker Sai Pre Release Event: ప్రభాస్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన కలిశారు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా చెప్పారు అని యంగ్ హీరో ధర్మ కామెంట్స్ చేశారు. డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీతోపాటు ప్రభాస్‌పై ఇలా మాట్లాడాడు హీరో ధర్మ.
Hero Dharma About Prabhas Wishes On Drinker Sai: టాలీవుడ్‌లోకి కొత్తగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ధర్మ. అలాగే, కొత్త హీరోయిన్‌గా పరిచయం కానుంది ఐశ్వర్య శర్మ. ఇలా ధర్మ, ఐశ్వర్య శర్మ కొత్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
డిసెంబర్ 27న రిలీజ్
డ్రింకర్ సాయి సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన డ్రింకర్ సాయి మూవీ డిసెంబర్ 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు అంటే డిసెంబర్ 25న డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా ప్రభాస్ విష్ చేయడంపై హీరో ధర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సక్సెస్ రేట్ తక్కువ
"డ్రింకర్ సాయి సినిమాను మా ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషనేట్‌గా నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్‌లో సక్సెస్ రేట్ చాలా తక్కువని తెలిసినా కథను నమ్మి వారు కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా సినిమాను ఇష్టపడి వర్క్ చేశారు" అని హీరో ధర్మ తెలిపాడు.
పదిమందికి చెప్పండి
"నేను హీరో అవుదామనే ఇండస్రీకి వచ్చాను. హీరోగానే బతుకుతాను, హీరోగానే చచ్చిపోతా. హీరో అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఇది నా డ్రీమ్. చిన్న సినిమాల ట్రైలర్, టీజర్ బాగుంటేనే మీరు థియేటర్స్‌కు వస్తారని తెలుసు. మేము ఎంత అడిగినా రారు. డ్రింకర్ సాయి సినిమా ట్రైలర్, టీజర్ మీకు నచ్చితే తప్పకుండా ఈ నెల 27న థియేటర్స్‌కు రండి. మీకు సినిమా నచ్చితే పది మందికి చెప్పండి" అని ధర్మ అన్నాడు.
ప్రభాస్‌ను కలిశాను
"ప్రభాస్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రభాస్ గారిని కలిశాను. ఆల్ ది బెస్ట్ చెప్పి, డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా చెప్పారు. ఆయన అలా విష్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది" అని డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ హీరో ధర్మ చెప్పుకొచ్చాడు.
తెర వెనుకే ఉంటాం
ఇక ఇదే ఈవెంట్‌లో డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. "టెక్నిషియన్స్‌గా మేము ఎప్పుడూ తెర వెనకే ఉంటాం. కానీ, డ్రింకర్ సాయి ఈవెంట్స్ మమ్మల్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమాను మేము మల్టిపుల్ టైమ్స్ చూశాం. కుటుంబంతో కలిసి సినిమాను మీరంతా చూడొచ్చు. డ్రింకర్ సాయి సినిమా విజయం మీద నమ్మకంతో ఉన్నాం" అని తెలిపారు.