Love Me: లవ్ మీలో దెయ్యంగా కనిపించేది ఆమెనే.. అసలు ట్విస్ట్ చెప్పిన హీరో ఆశిష్-hero ashish comments on love me if you dare movie ghost character and vaishnavi chaitanya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me: లవ్ మీలో దెయ్యంగా కనిపించేది ఆమెనే.. అసలు ట్విస్ట్ చెప్పిన హీరో ఆశిష్

Love Me: లవ్ మీలో దెయ్యంగా కనిపించేది ఆమెనే.. అసలు ట్విస్ట్ చెప్పిన హీరో ఆశిష్

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 12:32 PM IST

Hero Ashish Love Me If You Dare: లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాలో దెయ్యంగా నటించేది ఎవరో చెప్పి అసలు ట్విస్ట్ రివీల్ చేశాడు హీరో ఆశిష్. ఇంకా సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆశిష్. ఆ విశేషాలు చూద్దాం.

లవ్ మీలో దెయ్యంగా కనిపించేది ఆమెనే.. అసలు ట్విస్ట్ చెప్పిన హీరో ఆశిష్
లవ్ మీలో దెయ్యంగా కనిపించేది ఆమెనే.. అసలు ట్విస్ట్ చెప్పిన హీరో ఆశిష్

Love Me If You Dare Ashish: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ఈ హారర్ థ్రిల్లర్‌ను వరల్డ్ వైడ్‌గా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ఆశిష్‌ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.

ఈ సినిమా చేయ‌టానికి ముందు దెయ్యాల సినిమాలేమైనా చూశారు?

‘చంద్ర‌ముఖి’, ‘ముని’ వంటి సినిమాలు చాలానే చూశాను. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఓ స‌మ‌స్య ఉంటుంది. నాదేమో స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని వెతుక్కునే పాత్ర. ఇందులో హార‌ర్ అనేది ఓ భాగం మాత్ర‌మే. ఇందులో మంచి ల‌వ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇదేం రివేంజ్ స్టోరీ కాదు. ఇందులో వైష్ణ‌వి దెయ్యం కాదు.. సినిమాలో చాలా స‌ర్‌ప్రైజ్‌లున్నాయి. ప్రేక్ష‌కులు ల‌వ్ మీ సినిమా చూసిన త‌ర్వాత ఓ కొత్త, డిఫ‌రెంట్ మూవీ చూశామ‌ని థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వస్తారు.

ల‌వ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాలో దెయ్యంగా కనిపించేది ఎవరు?

మా సినిమాలో దివ్యావ‌తినే దెయ్యం పాత్ర‌లో న‌టించింది. వైష్ణ‌వి మ‌రో హీరోయిన్‌గా క‌నిపిస్తారు. సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉంటారు. సినిమా మొత్తంగా అంద‌రూ క‌నిపించ‌రు. చిన్న గెస్ట్ అయినా క‌నిపిస్తారు. అలా మొత్తంగా సినిమాలో ఆరుగురు హీరోయిన్స్ ఉన్నారు.

పీసీ శ్రీరామ్‌, కీర‌వాణి వంటి స్టార్ టెక్నీషియ‌న్స్‌తో వ‌ర్క్ చేయ‌టం ఎలా అనిపించింది?

కీర‌వాణి గారికి షూటింగ్‌కు రావాల్సిన అవ‌స‌రం లేదు. అందుక‌ని ఆయ‌న ఓ రోజు మాత్ర‌మే సెట్స్‌కు వ‌చ్చారు. పీసీ శ్రీరామ్‌గారితో వ‌ర్క్ చేయాల‌నుకున్న‌ప్పుడు తొలి రోజు టెన్ష‌న్ ప‌డ్డాను. ఎందుకంటే నాకైనా, వైష్ణ‌వికైనా రెండో సినిమానే. సరిగ్గా చేయ‌క‌పోతే శ్రీరామ్‌గారు ఏమైనా తిడ‌తారేమోన‌ని అనుకున్నాం. కానీ, ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎలాంటి టెన్ష‌న్ పెట్ట‌లేదు. ఆయ‌న‌తో మాట్లాడిన త‌ర్వాత కూల్ అయ్యాం.

సీక్వెల్ చేస్తారా?

‘ల‌వ్ మీ’ క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉంది. స్టోరీ ప‌రంగా సీక్వెల్ చేసేలా ఉంది. అయితే సీక్వెల్ చేయాల‌ని మేం అనుకోలేదు. ఆ నిర్ణ‌యం దిల్ రాజుగారు తీసుకోవాలి.

వైష్ణ‌వితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?

నేను, వైష్ణ‌వి, ర‌వికిష‌న్‌, సిమ్ర‌న్‌, నాగా అరుణ్ అంద‌రం ఒక్కో సినిమానే చేశాం. అందరం స్టూడెంట్స్‌లాగానే భావించాం. నేను, వైష్ణ‌వి అయితే.. ఒక్కొక్క‌రి క్యారెక్ట‌ర్స్‌ను ఎలా చేయాల‌నే దానిపై బాగా డిస్క‌స్ చేసుకునే వాళ్లం. షూటింగ్ స‌మ‌యంలో మంచి ఫ‌న్ ఉండింది. వైష్ణవి మంచి కో స్టార్‌. స్క్రిప్ట్ రీడింగ్ నుంచి క‌లిసి ట్రావెల్ చేయ‌టం వ‌ల్ల మాకు మంచి క్లారిటీ ఉండేది.

నెక్ట్స్ సినిమాలేంటి?

సెల్ఫిష్ సినిమా పూర్త‌య్యాక‌.. సితార బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాను.

ఇలా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నాడు హీరో ఆశిష్. అయితే, సినిమాలో దెయ్యంగా కనిపించేది ఎవరో చెప్పేసి అసలు ట్విస్ట్ రివీల్ చేశాడు. కానీ, సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని ఆయన మాటల్లో తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024