Dasara Release Movies : ఈ ఏడాది దసరాకు బాక్సాఫీసు రేసులో ఉండే సినిమాలివే-heres list of dasara release movies 2023 bhagavanth kesari tiger nageswara rao leo and bethaludu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Release Movies : ఈ ఏడాది దసరాకు బాక్సాఫీసు రేసులో ఉండే సినిమాలివే

Dasara Release Movies : ఈ ఏడాది దసరాకు బాక్సాఫీసు రేసులో ఉండే సినిమాలివే

Anand Sai HT Telugu
Aug 04, 2023 10:54 AM IST

Dasara Release Movies 2023 : దసరా అంటే.. సినిమా ఇండస్ట్రకీ పెద్ద పండగ. ఎందుకంటే.. చాలా మంది ప్రొడ్యూసర్స్.. సినిమాలు విడుదల చేసేందుకు లైన్లో ఉంటారు. మరి ఈసారి దసరాకు విడుదలయ్యే సినిమాలు ఏంటో చూద్దాం..

దసరా సినిమాలు
దసరా సినిమాలు

సంక్రాంతి, దసరా అనగానే పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు థియేటర్లకో వచ్చేస్తాయి. బాక్సాఫీసు దగ్గర పోరు మామూలుగా ఉండదు. పోయిన సంక్రాంతి సమయంలో చిరంజీవీ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి పోటీ పడ్డాయి. అదే సమయంలో తమిళం నుంచి దళపతి విజయ్ వారిసు, అజిత్ నటించిన తునీవు బరిలో నిలిచాయి. ఇక దసరా పండగ(Dasara Movies) వస్తుంది. బాక్సాఫీసును షేక్ చేసేందుకు స్టార్స్ సిద్ధమవుతున్నారు.

సాధారణంగా పండుగల సమయంలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతాయి. స్టార్ ఆర్టిస్టుల సినిమాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో సినిమా వసూళ్లు పెరుగుతాయి. చాలా మంది నిర్మాతలు ఈ దసరా పండుగపై కన్నేశారు. సినీ ప్రేక్షకులకు మంచి ట్రీట్‌ రానుంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఆయన తర్వాతి రాబోయే సినిమా కూడా అదే. భగవంత్ కేసరి(bhagavanth kesari) చిత్రంతో బాలయ్య దుమ్మురేపనున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. శరత్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటించారు. శ్రీలీల(Sreeleela) కూడా ఈ సినిమాలో నటించింది. అక్టోబర్‌ 19న చిత్రం విడుదల కానుంది.

యువ దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు(tiger nageswara rao) సినిమాలో రవితేజ(Ravi Teja) ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అనుపమ్ ఖేర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. టైగర్ నాగేశ్వర్‌రావు అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అక్టోబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమా పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. జనవరి నెలలో లియో సినిమా(Leo Cinema)కి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరాకి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా సమయంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మాస్ అవతారంలో కనిపిస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే 'బేతాళుడు' సినిమా(bethaludu)పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. నేను ఓజీ, అసలైన గ్యాంగ్‌స్టర్ అనే డైలాగ్ అందరినీ ఆకర్షించింది. కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో డిఫరెంట్ సినిమాలను అందించిన శ్రీని.. బేతాళుడు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. ఇప్పటివరకైతే.. బాలీవుడ్(Bollywood) నుంచి దసరా రేసులో ఉండే సినిమాలు ఏవీ లేవు. ఏదైనా చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మలయాళం నుంచి కూడా కొత్త సినిమా రేసులోకి రావచ్చు.

Whats_app_banner