OTT and Theater Releases: ఓటీటీ/థియేటర్లలో ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే.. ఓ లుక్కేయండి-here the list of this week ott and theaters release movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The List Of This Week Ott And Theaters Release Movies

OTT and Theater Releases: ఓటీటీ/థియేటర్లలో ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Sep 22, 2022 08:43 AM IST

This Week OTT and Theater releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు ఉన్నాయి.

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలివే
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలివే (Twitter)

This Week OTT and Theater releases: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల హడావిడి అంతా ఇంతా ఉండదు. అయితే కరోనా కాలంలో ఉవ్వెత్తున ఓటీటీల సెగ వీటికి తగిలినప్పటికీ.. థియేటర్లలో సినిమా సందడి పెద్దగా తగ్గలేదనే చెప్పుకోవాలి. కంటెంట్ ఉంటే ఓటీటీ కంటే కూడా థియేటర్లకే ఓటేస్తున్నారు మన ప్రేక్షకులు. అలా అనీ చెప్పేసి ప్రతి చిత్రాన్ని ఆదరిస్తారనుకోవడం పొరపాటే అవుతుంది. ఇదే సమయంలో చిన్న చిత్రాలకు స్వర్గదామంగా మారాయి ఓటీటీ వేదికలు. కంటెంట్ బాగుండాలే కానీ ఒటీటీ, థియేటర్లేంటి ఎక్కడైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వారంలానే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీల్లో పలు సినిమాలు ఆడియెన్స్‌ను పలకరించబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అల్లూరి..

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ అల్లూరి. ఇందులో శ్రీ విష్ణు తను ఇంత వరకు చేయని ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. పోలీసు అధికారిగా లాఠీ పట్టాడు. కయాదు లోహార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తణికెళ్ల భరణి, సుమన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరై చిత్రబృందానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.

కృష్ణ వ్రింద విహారి..

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా చేసిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమాలో షెర్లీ హీరోయిన్‌గా చేస్తుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 23న థియేటర్లలో విడుదల కానుంది. అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు.

దొంగలున్నారు జాగ్రత్త..

కీరవాణి తనయుడు సింహ నటించిన తాజా చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. సముద్రఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా కారులోనే తెరకెక్కించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ వారంలోనే సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సతీశ్ త్రిపుర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మాతృదేవోభవ..

ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న మరో సినిమా మాతృదేవోభవ. కుటుంబ బంధాలకు అద్దంపట్టేలా ఈ సినిమాను రూపొందించారు. సుధ, చమ్మక్ చంద్ర, రఘుబాబు తదితర తారాగణం ఇందులో నటించారు. ఈ చిత్రానికి హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్..

- ది పెర్ఫ్యూమర్(హాలీవుడ్)- సెప్టెంబరు 21

- జంతరా(హాలీవుడ్)- సెప్టెంబరు 23

- ఎల్‌వోయూ(హాలీవుడ్)- సెప్టెంబరు 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

- లైగర్(తెలుగు)- సెప్టెంబరు 22

- అందోర్(వెబ్‌సిరీస్)- సెప్టెంబరు 21

- దికర్దాషియన్స్(వెబ్ సిరీస్)- సెప్టెంబరు 22

- బబ్లీ బౌన్స్(హిందీ-తెలుగు- సెప్టెంబరు 23

ఆహా..

- ఫస్ట్ డే ఫస్ట్ షో(తెలుగు)- సెప్టెంబరు 23

- డైరీ(తమిళ చిత్రం)- సెప్టెంబరు 23

అమెజాన్ ప్రైమ్..

- డ్యూడ్(హిందీ సిరీస్)- సెప్టెంబరు 20

- హుష్ హుష్(హిందీ సిరీస్)- సెప్టెంబరు 22

జీ5..

- అతిథి దేవో భవ(హిందీ)- సెప్టెంబరు 22

IPL_Entry_Point

సంబంధిత కథనం