OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల‌కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే-here the list of movies and web series releasing on ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల‌కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల‌కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Sep 05, 2022 02:44 PM IST

Telugu new OTT Releases:ఈ వారం ఓటీటీ ద్వారా తెలుగు, త‌మిళం,క‌న్న‌డ భాష‌ల్లో ప‌లు అగ్ర‌హీరోలు న‌టించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే

<p>డేగల బాబ్జీ</p>
డేగల బాబ్జీ (Twitter/ahavideo)

Telugu new OTT Releases:

జీ5 ఓటీటీ

విక్రాంత్ రోణ (Vikranth Rona) - సెప్టెంబ‌ర్ 2 - జీ5 ఓటీటీ

కిచ్చా సుదీప్( Kiccha Sudeep)హీరోగా న‌టించిన కన్నడ చిత్రం విక్రాంత్ రోణ సెప్టెంబ‌ర్ 2న జీ5 ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది.మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశానికి గ్రాఫిక్స్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. జూలై 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైన విక్రాంత్ రోణ రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాగా సెప్టెంబ‌ర్ 2న క‌న్న‌డ వెర్ష‌న్ మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. తెలుగు, హిందీ వెర్ష‌న్స్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఖుదా హ‌ఫీజ్ పార్ట్ 2 - సెప్టెంబ‌ర్ 2 - జీ5

మై డియ‌ర్ భూతం - సెప్టెంబ‌ర్ 2 - జీ5

ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మై డియ‌ర్ భూతం చిత్రం సెప్టెంబ‌ర్ 2నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఫాంట‌సీ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ (Disney plus hotstar)

అక్ష‌య్ కుమార్ క‌ట్‌పుట్లీ - సెప్టెంబ‌ర్ 2- డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

ఈ ఏడాది బాలీవుడ్ అగ్రహీరో అక్ష‌య్ కుమార్‌కు ల‌క్ అంత‌గా క‌లిసి రాలేదు. అత‌డు హీరోగా న‌టించిన పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్ సినిమాలు డిజాస్ట‌ర్స్ గా మిగిలాయి. ఈ పరాజయాల ప్రభావంతో తాజా చిత్రం క‌ట్ పుట్లీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కాబోతున్న‌ది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన రాక్ష‌సుడు సినిమా ఆధారంగా సైకో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రంజిత్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది.

ది లార్డ్ ఆఫ్ రింగ్స్ - ది రింగ్స్ ఆఫ్ ప‌వ‌ర్ - సెప్టెంబ‌ర్ 2 -అమెజాన్ ప్రైమ్‌

నెట్‌ఫ్లిక్స్‌(Netflix)

బై మై హౌస్ - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

డేటెడ్ అండ్ రిలేటెడ్ - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

డెవిల్ ఇన్ ఓహియో - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

ఫేక్స్ - సెప్టెంబ‌ర్ 2- నెట్‌ఫ్లిక్స్‌

లిటిల్ ఉమెన్ - సెప్టెంబ‌ర్ 3 -నెట్‌ఫ్లిక్స్‌

ల‌వ్ ఇన్ ది విల్లా - సెప్టెంబ‌ర్ 1- నెట్‌ఫ్లిక్స్‌

స‌మురాయ్ రాబిట్ - సెప్టెంబ‌ర్ 1 - నెట్‌ఫ్లిక్స్‌

ది ఫెస్టివ‌ల్ ఆఫ్ ట్రౌబాడౌర్స్ - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

యూ ఆర్ నథింగ్ స్పెష‌ల్ - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

కాట్టేరి త‌మిళం - సెప్టెంబ‌ర్ 2 - నెట్‌ఫ్లిక్స్‌

సుంద‌రి గార్డెన్స్ - సెప్టెంబ‌ర్ 2 – సోనిలివ్

ఆహా ఓటీటీ (Aha)

డేగల బాబ్జీ - సెప్టెంబర్ 2- ఆహా ఓటీటీ

బండ్ల గణేష్ ఏక పాత్రలో నటించిన డేగల బాబ్జీ చిత్రం సెప్టెంబర్ 2న ఆహా ఓటీటీలో విడుదలకాబోతున్నది.

ఒత్త సెరప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వెంకటచంద్ర దర్శకత్వం వహించాడు.

వాంటెడ్ పండుగాడ్ - సెప్టెంబ‌ర్ 2- ఆహా

సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన వాంటెడ్ పండుగాడ్ చిత్రం సెప్టెంబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్, సుడిగాలి సుధీర్, బ్రహ్మానందం, అనసూయ, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించాడు.

Whats_app_banner