The Last of Us Review: హాలీవుడ్ సినిమాలు చూడటం అలవాటున్నవారికి జాంబీ చిత్రాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మనిషిపై వైరస్ దాడి చేయడం దీంతో మృగాలుగా మారి తోటి మానవులను తినేయడం.. ఇలా వారు కూడా మృగాల వలే మారి భయానక వాతావరణం ఏర్పడటం లాంటి కథాంశంలో ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలు వచ్చాయి. ఈ పరిస్థితుల నుంచి హీరో బయటపడేందుకు చేసే పోరాటమే రెగ్యూలర్ జాంబీ మూవీస్‌లో కనిపిస్తుంది. ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్‌లోనూ(The Last of Us ) ఇదే కథాంశం. అయితే కథ ఎలా ఉన్నా స్టోరీలో ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సిరీస్‍ను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనేది వాస్తవం. ఇందులో ఇదే జరిగింది. కానీ లాస్ట్ ఆఫ్ సిరీస్‌లో మానవాళికి పెను ప్రమాదాన్ని తీసుకొచ్చేది వైరస్ కాదు.. ఫంగస్. ఫంగస్ దాడితో ప్రపంచ వ్యాప్తంగా మానవులంతా జాంబీలుగా మారతారు.,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ నుంచి వారానికి ఓ ఎపిసోడ్ విడుదల అవుతుంది. 2013లో వచ్చిన లాస్ట్ ఆఫ్ అస్ అనే వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు.,కథ..జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఓ మిడిల్ ఏజ్జ్ వ్యక్తి, ఓ టీనేజ్ అమ్మాయిని జాంబీల నుంచి కాపాడేందుకు ఆమెతో సాగించే ప్రయాణమే ది లాస్ట్ ఆఫ్ సిరీస్. 2003లో జోయిల్(పెడ్రో పాస్కల్) తన టీనేజ్ కూతురుతో కలిసి అమెరికాలో నివాసిస్తు ఉంటాడు. ఇదే సమయంలో ఇండోనేషియాలో కొంతమందిని ఫంగస్ దాడి చేయడంతో వారు మృగాల వలే ప్రవర్తిస్తుంటారు. వెంటనే ఇండోనేషియా ప్రభుత్వం వారిని అక్కడిక్కడే చంపేస్తుంది. కానీ వారిని దాడి చేసిన వ్యక్తి గురించి మాత్రం ఆచూకి తెలియదు. ఆ క్రమంలోనే ఆ ఫంగస్ వ్యాప్తి ప్రపంచమొత్తం పాకుతుంది. జోయిల్ తన టీనేజ్ కూతురు, సోదరుడు టామ్‌తో కలిసి దేశం దాటి పారేపోయేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే వీరు కూడా వ్యాధి బారిన పడ్డారనుకుని ఓ మిలిటరీ అధికారి జోయిల్‌ను, అతడి కూతురును షూట్ చేస్తాడు. ఈ దాడిలో జోయిల్ కుమార్తే చనిపోతుంది. అప్పటి నుంచి సోదరుడితో కలిసి రిస్ట్రిక్టిడ్ ఏరియాలో అతడు జీవనం సాగిస్తుంటాడు. 20 ఏళ్ల తర్వాత ఓ టీనేజ్ అమ్మాయి రక్తంలో ఫంగస్‌కు విరుగుడు ఉంటుందని తెలుస్తోంది. ఆమెను సేఫ్‌గా వేరే ప్రదేశంలో శాస్త్రవేత్తలున్న ల్యాబ్‌కు తరలించే బాధ్యతను జోయిల్‌కు అప్పగిస్తారు. మరి ఆమెను కాపాడేందుకు జోయిల్ ఏం చేశారు? ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.,ఎలా ఉందంటే..మొదటి ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. కేవలం జాంబీ బ్యాక్ డ్రాప్‌లోనే కాకుండా స్టోరీలో ఎమోషన్స్‌పై దర్శకులు ఫోకస్ పెట్టారు. వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ కూడా వీడియో గేమ్ మాదిరిగా ఓ రోడ్ ప్రయాణం చుట్టూ ఈ కథ ఉంటుంది. ఈ జర్నీలో అడ్డంకులు, థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్‌కు ఇందులో కొదవే లేదు. ఉత్కంఠతో పాటు భయాన్ని కలిగించే సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ఇదే సమయంలో కథ కూడా ఎంతో లోతుగా ఉండి మానవ బంధాలను గుర్తుకుతెస్తుంది. కేవలం రెండు ఎపిసోడ్‌లతోనే ఈ విధమైన ప్రభావాన్ని కలిగజేశారంటే రాబోయే రోజుల్లో ఈ సిరీస్ గురించి సర్వత్ర చర్చ జరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.,రెగ్యూలర్ హాలీవుడ్ జాంబీ సిరీస్‌ల మాదిరిగా కాకుండా స్టోరీకి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. ఇదే సమయంలో జాంబీ సిరీస్ అంటే కలిగే భయం, ఉత్కంఠను బాగా చూపించారు. ఇప్పటి వరకు వైరస్ దాడి వల్ల జాంబీలు ఏర్పడతారనే చాలా మందికి తెలుసు. ఫంగస్ కూడా ఎంత ప్రమాదమో ఇందులో చూపించారు. ఈ సిరీస్‌కు గుర్తుగా గూగుల్ కూడా ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌లో ది లాస్ట్ ఆఫ్ అస్ అని టైప్ చేస్తే ఫంగస్ లాంటి ఆకృతులు మీ స్క్రీన్ అంతటా వ్యాపించి భయాన్ని కలిగిస్తాయి.,ఎవరెలా చేశారంటే..ఇందులో హీరోగా మధ్య వయస్కుడి పాత్రలో నటించిన పెడ్రో పాస్కల్ ఆకట్టుకున్నాడు. కూతురును కోల్పోయిన వ్యక్తిగా అతడు భావాలను చాలా బాగా పండించాడు. ప్రపంచమంతా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమయంలో బతకు కోసం సాగించే అతడి తెగువ, పోరాటం ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఎల్లీ పాత్రలో నటించిన బెల్లా రామ్సే అదరగొట్టింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో లియానా మోర్మోంట్ పాత్రలో అలరించిన బెల్లా.. ఇందులో పూర్తి స్థాయి పాత్రలో కనిపించింది. రెండు ఎపిసోడ్‌లు మాత్రమే విడుదలయ్యాయి కాబట్టి.. రాబోయో రోజుల్లో రానున్న ఎపిసోడ్లలో ఈ పాత్రకు సంబంధించిన మరిన్ని కోణాలు ఆవిష్కృతమయ్యే అవకాశముంది.,సాంకేతితిక వర్గం..క్వాలిటీ పరంగా ఉన్నత స్థాయిలో ఉంది. విజువల్స్, టేకింగ్, కేమెరా పనితనం అన్ని విషయాల్లోనూ హాలీవుడ్ దర్శకులు క్రేగ్ మాజిన్, నీల్ డ్రక్‌మన్ తన పనితనం చూపించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన హౌస్ ఆఫ్ డ్రాగన్, స్క్విడ్ గేమ్ తర్వాత ఆ స్థాయిలో ఇది అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్ జోనర్ కథల్లో సైంటిఫిక్ అంశాలతో పాటు కథలో బలం, భావోద్వేగం కూడా ఉండాలి. ఈ విషయంలో ఇందులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ మూవీ రేటింగ్ పోర్టల్ ఐఎండీబీ కూడా ఈ సిరీస్‌కు10కి 9కిపైగా రేటింగ్‌ను ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు.,చివరగా.. ది లాస్ట్ ఆఫ్ సిరీస్ భయపెడుతూనే స్టోరీలో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది,రేటింగ్.. 4/5(తొలి రెండు ఎపిసోడ్‌లకు),