OTT Releases ThisWeek: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే-here the full list of movies and web series releasing this week on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The Full List Of Movies And Web Series Releasing This Week On Ott

OTT Releases ThisWeek: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Nov 24, 2022 06:15 AM IST

OTT Releases ThisWeek: థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన కాంతారాతో పాటు ప‌లు సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు విడుద‌ల‌కానున్నాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే...

మీట్ క్యూట్
మీట్ క్యూట్

OTT Releases ThisWeek:

రిష‌బ్ శెట్టి కాంతారా (Kantara)- న‌వంబ‌ర్ 24 - అమెజాన్ ప్రైమ్‌ (Amazon prime video)

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఓటీటీ ఫ్యాన్స్ అంత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కాంతారా ఒక‌టి. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 15 కోట్ల‌తో నిర్మిస్తే దాదాపు 350 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. న‌వంబ‌ర్ 24 న (నేడు)అమెజాన్ ప్రైమ్‌లో కాంతారా రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. శివ అనే యువ‌కుడి క‌థ ఇది. ఫారెస్ట్ ఆఫీస‌ర్స్‌తో క‌లిసి త‌మ భూముల‌ను ఆక్ర‌మించుకోవాల‌ని చూసిన రాజ‌వంశీయుల‌పై శివ ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌ది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.

శివ‌కార్తికేయ‌న్ ప్రిన్స్ (Sivakarthikeyan prince)- న‌వంబ‌ర్ 25 -డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

శివ‌కార్తికేయ‌న్ హీరోగా కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రిన్స్ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో న‌వంబ‌ర్ 25న రిలీజ్ కానుంది. బ్రిట‌న్ యువ‌తితో ప్రేమ‌లో ప‌డిన ఓ ఇండియ‌న్ యువ‌కుడి క‌థ ఇది. వినోదానికి ఓ చిరు సందేశాన్ని జోడించి ద‌ర్శ‌కుడు అనుదీప్ ఈ సినిమాను రూపొందించారు. భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప్రిన్స్‌ యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

చెల్లో షో (chello show)- న‌వంబ‌ర్ 25 -నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

ఈ ఏడాది ఇండియా నుంచి అఫీషియ‌ల్‌గా ఆస్కార్ ఎంట్రీని ద‌క్కించుకున్న గుజ‌రాతీ ఫిల్మ్ చెల్లో షో న‌వంబ‌ర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిన్న త‌నంలో త‌న‌కు ఎదురైన సంఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు పాన్ న‌లిన్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమాల‌పై ఇష్టం ఏర్ప‌ర‌చుకున్న ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి జీవితం చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

దుల్క‌ర్ స‌ల్మాన్‌ చుప్ (Dulquer Salmaan Chup)-న‌వంబ‌ర్ 25 - జీ5

దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌న్నీడియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ చిత్రం చుప్‌. ఆర్ బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 25న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. సినిమా రివ్యూవ‌ర్స్‌ను చంపే ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ ఇది. హిందీలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను ఈ సినిమా అందుకున్న‌ది.

మీట్ క్యూట్ (Meet cute)- న‌వంబ‌ర్ 25 - సోని లివ్‌

హీరో నాని నిర్మాణంలో ఆయ‌న సోద‌రి గంటా దీప్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆంథాల‌జీ వెబ్‌సిరీస్ మీట్ క్యూట్ న‌వంబ‌ర్ 25న సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఐదు క‌థ‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌లో స‌త్య‌రాజ్‌, రుహానీ శ‌ర్మ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ఆకాంక్ష‌సింగ్‌, రోహిణి, విరాజ్ అశ్విన్‌, అదాశ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

గ‌ర్ల్స్ హాస్ట‌ల్ వెబ్ సిరీస్ సీజ‌న్ 3 - న‌వంబ‌ర్ 25 సోని లివ్‌

స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ - న‌వంబ‌ర్ 25 - ఆహా ఓటీటీ

అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 ఎపిసోడ్ 4 -న‌వంబ‌ర్ 25- ఆహా ఓటీటీ

ఖాకీ ది బీహార్ ఛాప్ట‌ర్ -న‌వంబ‌ర్ 25 -నెట్‌ఫ్లిక్స్‌

ది నోయ‌ల్ డైరీ -న‌వంబ‌ర్ 25 -నెట్‌ఫ్లిక్స్‌

ది గార్డియ‌న్ ఆఫ్ ది గెలాక్సీ హాలీడే స్పెష‌ల్ - న‌వంబ‌ర్ 25 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

ప‌డ‌వెట్టు - న‌వంబ‌ర్ 25- నెట్‌ఫ్లిక్స్‌

IPL_Entry_Point