Bigg Boss Telugu 6 Episode 79: ఈ వారం నామినేషన్లో ఏడుగురు.. శ్రీసత్యకు బిగ్‌బాస్ కౌంటర్
Bigg Boss Telugu 6 Episode 79: బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్లలో మొత్తంగా ఏడుగురు నామినేట్ చేశారు. మరోపక్క హౌస్ మేట్స్ నుంచి రేవంత్ కెప్టెన్సీపై అసంతృప్తి రగులుతుంది. ఫుడ్ విషయంలో అతడు స్ట్రిక్ట్‌గా ఉండటం నచ్చలేదని అన్నారు.
Bigg Boss Telugu 6 Episode 79: బిగ్‌బాస్ షోలో ఆసక్తికరమైన ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది నామినేషన్‌ల ప్రక్రియం. బిగ్‌బాస్ సీజన్ 6లో 12వ వారం నామినేషన్ ప్రక్రియ తొలిసారిగా కన్ఫెషన్ రూంలో జరిగింది. ఇంటి సభ్యులు ఎవరినైతే హౌస్ నుంచి పంపించాలనుకుంటున్నారో వారికి సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని చెబుతాడు. ఇందుకు వాళ్ల ఫొటోను మిషన్‌లో వేసి ముక్కలు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి సీక్రెట్ నామినేషన్ ప్రక్రియ. మరోవైపు కెప్టెన్ రేవంత్ కఠోర నియమాలతో ఇంటి సభ్యులు ఇబ్బంది పడుతున్నారు.
ముందుగా నామినేషన్ ప్రక్రియలో రోహిత్.. శ్రీహాన్, ఫైమాలను నామినేట్ చేస్తాడు. టాస్క్‌లో మెరీనాపై గట్టిగా అరిచినందుకు గాను శ్రీహాన్‌ను నామినేట్ చేయగా.. సంచాలక్‌గా ఫైమా ఫెయిర్‌గా చేయలేదనే కారణాలతో ఆమెను నామినేట్ చేశాడు. అనంతరం శ్రీసత్య..రాజ్, రోహిత్‌లను నామినేట్ చేసింది. అయితే రాజ్ ఇంతవరకు నామినేషన్లలో రాలేదు..అందేకు ఈ వారం నామినేట్ చేస్తున్నానని తెలిపింది. ఇందుకు శ్రీసత్యను బిగ్‌బాస్ సరైన కారణాలు చెప్పమని హెచ్చరించగా.. రాజ్ ఈ వారం టాస్క్‌లో సరిగ్గా ఫర్ఫార్మ్ చేయనందుకు చేస్తున్నానని జారుకుంది. అనంతరం రోహిత్ అభ్యంతరకర పదాన్ని వాడినందుకు నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది.
అంతరం రాజ్.. శ్రీహాన్, శ్రీసత్యను నామినేట్ చేశాడు. రోహిత్ కోప్పడ్డాడని గతవారం రోహిత్ నామినేట్ చేశాడు. కానీ ఈ వారం శ్రీహాన్ అదే తప్పు చేసి.. మెరీనాపై అరిచాడు. రెండోది చెక్ రాసే సమయంలో వేరే వాళ్ల అమౌంట్ తగ్గించడానికి ఇష్టం లేదని అందుకే లక్ష రాశానని చెప్పాడు. అదే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో రూ.1.5 లక్షలు పెట్టి ఖర్చు చేశాడు. అక్కడ అలా.. ఇక్కడ మరోలా అందుకే ఈ రెండు పాయింట్లపై శ్రీహాన్‌ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు.శ్రీసత్యను నామినేట్ చేస్తూ.. చెక్ అమౌంట్ చేయొద్దని బిగ్‌బాస్ చెప్పినా ఆమె శ్రీహాన్ అమౌంట్ గురించి చెప్పింది అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు.
తర్వాత వచ్చిన కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్యలను నామినేట్ చేసింది. శ్రీహాన్ వెటకారం నచ్చట్లేదని.. శ్రీసత్య ఎప్పుడూ రెచ్చగొట్టాలని చూస్తుందని, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో హర్ట్ అవుతుందని కీర్తి చెప్పింది. అనంతరం ఫైమా.. రోహిత్, ఫైమాను నామినేట్ చేశాడు. రోహిత్ సరిగ్గా టాస్క్ పర్ఫార్మ్ చేయలేదని చేయగా.. ఆడవాళ్లలో టాస్క్ ఆడేదే ఇనాయ.. అలాంటిది తను గతవారం సరిగ్గా ఆడటమే కాకుండా ఫిజికల్ టాస్క్‌లో నేను వీక్ అని నామినేట్ చేయం కామెడీగా అనిపించింది.
అనంతరం శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డిలను నామినేట్ శాడు. గోల్ టాస్క్‌లో సంచాలక్‌గా రోహిత్ సరిగ్గా ఆడలేదని అన్నాడు. తర్వాత ఆదిరెడ్డిని నామినేట్ చేస్తూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో ఆడకుండా ఉండటం తనకు నచ్చలేదని, టాస్క్‌లో లూప్స్ వెతకాడని స్పష్టం చేశాడు.
అనంతరం ఇనాయ.. ఫైమా, రాజ్‌ను నామినేట్ చేసింది. తనకి ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్లని నామినేట్ చేయడం బాధగా ఉందని, తనను కావాలనే దూరం పెట్టారని టార్గెట్ చేశారని ఏడ్చింది. గత కొన్ని వారాలుగా రాజ్ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నాడని స్పష్టం చేసింది. చివరిగా ఆదిరెడ్డి.. ఇనాయ, శ్రీహాన్ నామినేట్ చేశాడు. చివరిగా రేవంత్.. ఫైమా, ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారంలో కెప్టెన్ రేవంత్, కీర్తి మినహా మిగిలినవారంతా నామినేట్ అయ్యారు.
అనంతరం ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలకు హౌస్ మేట్స్ సమాధానాలు చెప్పారు. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిచినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిజటం అని పెద్ద స్టేట్మెంట్లు పాస్ ఇస్తారు. మీరు ఆడియెన్స్ నుంచి సింపతీ కోరుకోడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటి రెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్మతున్నారు అని రాజ్‌ను అడుగ్గా.. నా గురించి ఎవరు చెడుగా మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనాయా .. కానీ ఇనాయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం