Pan India Movies : ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్‍లో విడుదలయ్యే సినిమాలివే-here are the movies that releasing pan india level kushi jawan kalki 2989 game changer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Here Are The Movies That Releasing Pan India Level Kushi Jawan Kalki 2989 Game Changer

Pan India Movies : ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్‍లో విడుదలయ్యే సినిమాలివే

Anand Sai HT Telugu
Aug 26, 2023 10:44 AM IST

Pan India Movies : కొన్ని రోజులు పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. దీంతో చాలా సినిమాలు ఆ స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్‍లో విడుదలయ్యేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

ఖుషి సినిమా
ఖుషి సినిమా

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2(Bahubali 2) పాన్ ఇండియా లెవెల్‍లో విడుదలై బాక్సాఫీసును షేక్ చేశాయి. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ఇతర భాషల్లోకి డబ్ అయింది. అక్కడ కూడా భారీగానే లాభపడింది. అప్పటి నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కేజీఎఫ్(KGF), పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌తో సహా పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచాయి. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరగనుంది. ఈ ఏడాది కూడా పాన్ ఇండియా సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత(Samantha)కు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. త్వరలో వీరు కలిసి నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖుషి సినిమా(Kushi Cinema) పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. సెప్టెంబర్ 1న సినిమా థియేటర్లలోకి వస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

జవాన్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. షారుక్ ఖాన్(Shah Rukh Khan), నయనతార(Nayantara) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రీ-బుకింగ్ ప్రారంభించి, సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

ప్రభాస్(Prabhas) వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. సలార్(Salaar) సినిమాతో విజయం సాధించాలని ధీమాగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్(Prashnth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. తెలుగు, కన్నడ సహా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ తారాగణంతో అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.

రామ్ చరణ్(Ram Charan) RRR సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న 'గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. తెలుగు, హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెట్ ఫోటో లీకైంది.

జూనియర్ ఎన్టీఆర్(NTR) నటించిన దేవర పోస్టర్ల ద్వారా అందరినీ ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది.

పుష్ప 2(Pushpa 2) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. రెండో భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితరులు నటించారు. పుష్ప సినిమాకుగానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్.

'విక్రమ్' విజయం తర్వాత కమల్ హాసన్ మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నాడు. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లియో చిత్రం(Leo Cinema) శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్, ఖైదీ సినిమాలకు లియో సినిమాతో అనుబంధం ఉంటుందని అంటున్నారు.

చంద్రముఖి సినిమా హిట్ అయింది. హారర్ స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు చంద్రముఖి 2 చిత్రానికి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ తదితరులు నటించారు. సైకలాజికల్ డ్రామా తరహాలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా.

కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌(Shivakumar) నటిస్తున్న బేతాళుడు సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఎంజీ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌తో అందరినీ ఆకట్టుకుంది. కన్నడతో పాటు మూడు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ధృవ సర్జా నటించిన 'మార్టిన్' చిత్రం టీజర్ ద్వారా అందరినీ ఆకర్షించింది. ఈ సినిమా 2023లోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ని 50 రోజుల పాటు చిత్రీకరించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.