HER OTT Streaming: సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసిన రుహానీ శర్మ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హర్’
HER Chapter 1 OTT Streaming: రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ హర్ - చాప్టర్ 1 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు హడావుడి లేకుండా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
HER Chapter 1 OTT Streaming: చి.ల.సౌ మూవీ ఫేమ్ నటి రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హర్ - చాప్టర్ 1 సినిమా జూలైలో 21న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రుహానీ యాక్టింగ్ ఆకట్టుకుంది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో హర్ చిత్రం ఆడలేదు. ఇప్పుడు సడన్‍గా హర్ - చాప్టర్ 1 సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.
ట్రెండింగ్ వార్తలు
హర్ - చాప్టర్ 1 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ముందస్తుగా ప్రచార హడావుడి లేకుండా ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.
హర్ - చాప్టర్ 1 మూవీ సినిమాలో రుహానీ శర్మ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు. వికాశ్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, సంజయ్ స్వరూప్, బెనర్జీ కీలకపాత్రలు పోషించారు. శ్రీధరర్ స్వరాగవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ పతాకంపై రఘు సంకురాత్రి, దీప ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటంతో మంచి హైప్ వచ్చింది. కానీ థియేటర్లలో ఆ స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
HER Chapter 1 సినిమాకు పవన్ సంగీతం అందించగా.. చాణక్య ఎడిటర్‌గా, విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
హైదరాబాద్ శివార్లలో రెండు హత్యలు జరుగుతాయి. ఆ కేసు విచారణను ఏసీపీ అర్చన ప్రసాద్ (రహానీ శర్మ) చేపడతారు. ఈ హత్యలు చేసింది ఎవరు? వారిని ఏసీపీ ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ చిత్రం కథ. ఈ చిత్రంలోని కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథనం మాత్రం కాస్త ఊహలకు అందేలానే సాగుతుంది.
టాపిక్