Hellboy 4 Review: హెల్‌బాయ్ 4 రివ్యూ- మంత్రాలు, న్యూడ్ సీన్స్‌తో తెలుగులోని ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
Hellboy The Crooked Man Review In Telugu: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది క్రూక్‌డ్ మ్యాన్. మంత్రాలు, న్యూడ్ సీన్స్, దెయ్యాలను పట్టుకునే వింత మనిషి సినిమా ఎలా ఉందో నేటి హెల్‌బాయ్ 4 రివ్యూలో తెలుసుకుందాం.
Hellboy 4 Review And Rating In Telugu: అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హెల్‌బాయ్ ది క్రూడ్ మ్యాన్. రూ. 173 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ సూపర్ హీరో హారర్ యాక్షన్ ఫ్రాంచైజీ హెల్‌బాయ్ నుంచి నాలుగో సినిమాగా వచ్చిందే హెల్‌బాయ్ ది క్రూడ్ మ్యాన్.

2 ఓటీటీల్లో తెలుగులో
ఇటీవల లయన్స్‌గేట్ ప్లేలో ఎలాంటి రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రిప్షన్‌తో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది హెల్‌బాయ్ 4. అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లే రెండు ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ సినిమాను బ్రియన్ టేలర్ దర్శకత్వం వహించారు.
హెల్‌బాయ్‌గా జాక్ కెసీ నటించగా.. జెఫెర్సన్ వైట్, అడెలైన్ రుడాల్ఫ్, లేహ్ మెక్‌నమరా, హన్నా మార్గెట్‌సన్, మార్టిన్ బసిండలే, జోసెఫ్ మార్సెల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఈ కథ 1959లో జరుగుతుంది. రైలులో సగం మనిషి, సగం రాక్షసుడు అయిన హెల్‌బాయ్ (జాక్ కెసీ), బ్యూరో ఫర్ పారానార్మల్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ ఏజెంట్ బాబీ జో (అడెలైన్ రుడాల్ఫ్)తో కలిసి ప్రయాణం చేస్తారు. దెయ్యాలను ఆకర్షించే కార్గో అనే ఒక సాలీడుని రవాణా చేస్తుంటారు. దెయ్యాలను పట్టుకునే హెల్‌బాయ్, ఏజెంట్‌పై బాక్స్‌లోని సాలీడు బయటకు వచ్చేసి అటాక్ చేస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌తోపాటు హెల్‌బాయ్, బాబీ జో ఓ అడవిలో పడిపోతారు.
అతి పొడవైన చెట్లతో నిండి ఉన్న అప్లాచియా ప్రాంతం అది. సాలీడు ఇక్కడే ఎందుకు తప్పించుకుంది, ఇక్కడ ఏదో ఈవిల్ వాతావరణం కనిపిస్తుందన్న అనుమానించిన హెల్‌బాయ్ అక్కడి నుంచి బయటపడాలనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? హెల్‌బాయ్, ఏజెంట్ ప్రాణాలతో బయటపడ్డారా? ఈ క్రమంలో వారికి హెల్ప్ చేసిన టామ్ ఫెరల్ (జెఫెర్సన్ వైట్) ఎవరు? అతని గతం ఏంటీ? అసలు క్రూక్‌డ్ మ్యాన్ అంటే ఎవరు? అతను ఏం చేస్తాడు? అనే ఆసక్తికర విషయాలతో సాగే సినిమానే హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్.
విశ్లేషణ:
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే 90స్ కిడ్స్‌కు హెల్‌బాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరిస్‌లో మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దాంతో 2019లో హెల్‌బాయ్ అనే టైటిల్‌తో కొత్తగా రీబూట్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేశారు. కానీ, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో 2024లో నాలుగో సినిమాగా హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ టైటిల్‌తో సరికొత్తగా రీబూట్ ఫ్రాంచైజీ ప్లాన్ చేశారు.
సుమారుగా రూ. 173 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన హెల్‌బాయ్ 4 సినిమాను థియేటర్లలో కాకుండా వీడియో ఆన్ డిమాండ్ (రెంటల్ విధానం) పద్ధతిలో నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ చేశారు. పలుచోట్ల ప్రీమియర్స్ వేశారు. కానీ, ఈ సినిమాకు ఇలా కేవలం రూ. 17 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్‌గా లయన్స్ గేట్ ప్లేలో కూడా నాలుగు భాషల్లో హెల్‌బాయ్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు.
మంచి యాక్షన్ సీన్‌తో
ఇలాంటి హెల్‌బాయ్ 4 సినిమా విశ్లేషణలోకి వెళితే.. క్రూక్‌డ్ మ్యాన్ అంటే ఒక వంకర మనిషి అని అర్థం. పాత సినిమాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కొత్తగా చూసేవాళ్లు హెల్‌బాయ్ గురించి తెలియకపోయినా మూవీని చూసేయొచ్చు. సినిమా ప్రారంభమే భారీ సాలీడుతో మంచి యాక్షన్ సీన్‌తో స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత అప్లాచియా అడవిలో హీరో హీరోయిన్ పడిపోవడం, విచ్ బాల్, మంత్రాలు, తాంత్రిక శక్తి, క్రూక్‌డ్ మ్యాన్ గురించి తెలియడం వంటి సీన్స్‌తో ఆసక్తిగా సాగుతుంది. టామ్ ఫెరల్ పరిచయం, అతని గతం ఇలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఆ తర్వాత అడవిలో స్నేక్ ఫైట్ బాగుంటుంది. అయితే, సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ చాలానే ఉన్నాయి. ఊహించని, ఎన్నడూ చూడని సన్నివేశాలతో కాస్తా విరక్తి కలుగుతుంది.
ఇంపాక్ట్ చేయని క్లైమాక్స్
క్రూక్‌డ్ మ్యాన్‌ను చంపే సీన్ ఎఫెక్టివ్‌గా ఉండదు. క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. రెండు, మూడు యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతాయి అంతే. బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. యాక్టర్స్ పర్ఫామెన్స్ డీసెంట్‌గానే ఉంది. ఈ సినిమాతోనే కొత్త హెల్‌బాయ్‌గా యాక్ట్ చేసిన జాక్ కెసీ యాక్టింగ్ పర్వాలేదు. రెండు మూడు చోట్ల హాఫ్ న్యూడ్ సీన్స్, విరక్తి కలిగే సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి, ఫ్యామిలీతో చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
ఫైనల్‌గా చెప్పాలంటే గంట నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాను యావరేజ్ అని చెప్పొచ్చు. అయితే, గందరగోళం, గజిబిజి సన్నివేశాలతో హెల్‌బాయ్ ఫ్రాంచైజీ అభిమానులను ఈ మూవీ నిరాశపరిచిందనే చెప్పాలి. అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లే రెండు ఓటీటీల్లో తెలుగులో అందుబాటులో ఉన్న హెల్‌బాయ్ ది క్రూడ్ మ్యాన్‌పై హారర్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.25/5
సంబంధిత కథనం
టాపిక్