OTT Horror: 160 కోట్ల బడ్జెట్.. 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
Hellboy The Crooked Man OTT Streaming: ఓటీటీలోకి హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ వచ్చేసింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హెల్ బాయ్ 4 మూవీకి కేవలం 31 లక్షల కలెక్షన్స్ తెచ్చుకుని డిజాస్టర్‌గా నిలిచింది. అలాంటి ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Hellboy 4 OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వాటికి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే, ఇప్పటివరకు హారర్ జోనర్‌లో కామెడీ, రొమాన్స్, ఇన్వెస్టిగేషన్ వంటి తరహా కంటెంట్ సినిమాలు వచ్చాయి. కానీ, హారర్ జోనర్‌కి యాక్షన్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమాలు చాలా అరుదు.

హెల్‌బాయ్ ఫ్రాంచైజీలో
అలా హారర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన హాలీవుడ్ మూవీనే హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (Hellboy The Crooked Man). ఈ సినిమా హెల్ బాయ్ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో సినిమా. మొదటగా 2004లో హెల్‌బాయ్ మూవీ విడుదలైంది. ఇందులో రాన్ పెరల్మాన్ టైటిల్ రోల్‌లో మెయిన్ లీడ్‌గా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
మొదటి రెండు పార్ట్స్ హిట్
అనంతరం నాలుగేళ్లకు 2008లో సీక్వెల్‌గా హెల్‌బాయ్ 2 ది గోల్డెన్ ఆర్మీ రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి పార్ట్‌గా కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మొదటి రెండు సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్‌లో రాన్ పెరల్మాన్ నటించాడు. తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమాగా 2019లో హెల్ బాయ్ అనే టైటిల్‌తో రిలీజ్ అయింది.
యావరేజ్‌గా హెల్ బాయ్ 3
కానీ, ఇందులో హీరో మారిపోయాడు. రాన్ పెరల్మాన్‌కు బదులు హెల్ బాయ్ 3లో డేవిడ్ హార్బర్ నటించగా.. విలన్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ మిల్లా జోవోవిచ్ యాక్ట్ చేసింది. అయితే, ఈ సినిమాకు అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అనంతరం, ఐదేళ్లకు 2024లో ఈ సిరీస్ నుంచి నాలుగో సినిమాగా హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ రిలీజ్ అయింది.
బడ్జెట్ అండ్ కలెక్షన్స్
హెల్ బాయ్ 4లో మరోసారి హీరో మారిపోయాడు. ఇందులో జాక్ కేసీ హెల్ బాయ్‌గా నటించాడు. 20 మిలియన్ల డాలర్లతో అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 160 కోట్ల బడ్జెట్‌తో హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ మూవీని తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం 2 మిలియన్ డాలర్స్ (రూ. 20 లక్షలు) మాత్రమే రాబట్టగలిగింది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
హెల్‌బాయ్ ఫ్రాంచైజీలోనే డిజాస్టర్ మూవీగా హెల్ బాయ్ 4 రికార్డ్ క్రియేట్ చేసుకుంది. అలాంటి హెల్‌బాయ్ 4 రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో హెల్ బాయ్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక మరో ఓటీటీ అయిన లయన్స్ గేట్ ప్లేలో కూడా హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో రిలీజ్
జనవరి 17 నుంచి లయన్స్ గేట్ ప్లేలో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పుడు చూడని ఫాంటసీ వరల్డ్‌లో హారర్ యాక్షన్ మేళవింపుతో హెల్‌బాయ్ 4 తెరకెక్కినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం