Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడిక్ డ్రామా.. విమర్శలు, ప్రశంసలు రెండూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-heeramandi ott response sanjay leela bhansali heeramandi ott streaming on netflix netizens praises heeramandi web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi Ott: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడిక్ డ్రామా.. విమర్శలు, ప్రశంసలు రెండూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడిక్ డ్రామా.. విమర్శలు, ప్రశంసలు రెండూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

Heeramandi OTT Response: హిందీ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ హీరామండి. మే 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ పీరియాడిక్ డ్రామా సిరీస్‌కు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడిక్ డ్రామా.. విమర్శలు, ప్రశంసలు రెండూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Heeramandi OTT Streaming Now: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన హీరామండి: డైమండ్ బజార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఒకే స్వరంతో ప్రశంసలు కురిపిస్తూ.. "నేను చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి. ఇది ఒక కళాఖండం" అని అభిప్రాయపడుతున్నారు.

ఓటీటీ ప్రపంచంలోకి సంజయ్ లీలా భన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌ (Heeramandi: The Diamond Bazaar) వెబ్ సిరీస్‌తో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసినట్లు నెటిజన్స్ చెబుతున్నారు. వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, బ్రేకింగ్ బాడ్ వంటి సిరీసులతో పోలుస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ సిరీస్‌లతో పోటీపడుతోందని అంటున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ తన అద్భుతమైన కథనంతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ షో చూసిన ప్రేక్షకులు విభిన్న అంశాల గురించి చర్చించడం విశేషం. అలాగే సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రశంసిస్తున్నారు. దాంతో ఇంటర్నెట్ అంతా హీరామండితో ట్వీట్స్‌తో నిండిపోయింది. ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఉత్కంఠభరితమైన విజువల్స్ నుంచి ఆకట్టుకునే కథల వరకు.. ప్రతి ఫ్రేమ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిభకు నిదర్శనం అంటూ పొగుడుతున్నారు. ఈ షోపై నెటిజన్లు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నారో చూద్దాం.

"ఇది ఒక అద్భుతమైన కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. SLB (సంజయ్ లీలా భన్సాలీ) మళ్లీ మాయ చేశాడు!", "కథ, నటన, దర్శకత్వం - అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా చూడండి!", "సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అంటూ పలు విధాలుగా అనేక మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన "హీరామండి: ది డైమండ్ బజార్" మే 1వ తేది నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో (Netflix OTT) స్ట్రీమింగ్ అవుతోంది. హీరామండి వెబ్ సిరీస్ 190 దేశాలలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో కలిపి మొత్తంగా 14 భాషల్లో విడుదల అయింది.

1940వ దశకంలో భారత స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో అలనాటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తాహా షా బదుషా తదితరులు నటించారు. కాగా సిరీస్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు అని మేకర్స్ చెబుతున్నా మరోవైపు నుంచి హీరామండిపై మిశ్రమ స్పందన, విమర్శలు తలెత్తుతున్నాయి.

హీరామండి సిరీస్‌లో చూపించినట్లుగా ఆ కాలం నాటి వేశ్యలు ఇంతటి హంగు ఆర్భాటాలతో లేరని, జీవించేందుకు చాలా కష్టపడేవారని విమర్శకులు చెబుతున్నారు. అలాగే సోనాక్షి సిన్హా ఉర్దూ పేపర్ చదుతువున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ పేపర్‌లో 2022 సంవత్సరానికి సంబంధించిన న్యూస్ రావడంపై ఈ కాలం నాటి న్యూస్ అప్పుడే ఎలా వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.