Romantic Thriller OTT: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Romantic Thriller OTT: హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సందేహం థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సందేహం మూవీలో బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ కీలక పాత్ర పోషించింది.
Romantic Thriller OTT: హెబ్బాపటేల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ సందేహం ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సందేహం మూవీలో సుమన్ తేజ్ హీరోగా నటించాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు. బిగ్‌బాస్ ఫేమ్ శ్వేత వర్మ కీలక పాత్రలో కనిపించింది.
ఐదు నెలల తర్వాత...
జూన్ నెలలో థియేటర్లలో సందేహం మూవీ రిలీజైంది. దాదాపు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలో హీరో సుమన్ తేజ్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. దిల్‌రాజు బంధువుగా సుమన్ తేజ్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ…
హర్ష (సుమన్ తేజ్) శృతి (హెబ్బాపటేల్) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పకుండా అరెంజ్ మ్యారేజీలా ప్లాన్ చేసి ఇద్దరు ఒక్కటవుతారు.పెళ్లి తర్వాత శృతిలో మార్పు వస్తుంది. హర్షను దూరం పెడుతుంది. ఫస్ట్ నైట్‌కు ఒప్పుకోదు. అదే టైమ్‌లో శృతి మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆర్య (సుమన్ తేజ్) ఆమె జీవితంలోకి మళ్లీ ఎంటర్ అవుతాడు. శృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు.
పెళ్లైనా కొద్ది రోజుల్లోనే కరోనా కారణంగా హర్ష చనిపోతాడు. హర్ష మరణంపై అతడి చెల్లెలికి ఓ క్లూ దొరకుతుంది. అదేమిటి? హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? హర్ష, ఆర్య ఒకే పోలికలతో ఉండటానికి కారణం ఏమిటి? హర్ష మర్డర్ కేసులో పోలీస్ ఆఫీసర్ (శ్వేతా వర్మ) శృతిని ఎందుకు అనుమానించింది? ఆర్య నిజంగానే శృతి బాయ్‌ఫ్రెండా? ఈ చిక్కుముడి ఎలా రివీలైంది అన్నదే ఈ మూవీ కథ.
బ్యాక్ టూ బ్యాక్ మూవీస్...
జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది హెబ్బా పటేల్. హీరోయిన్‌గా ఈ ఏడాది హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ధూం ధాం సినిమాలు చేసింది. వేయ్‌దరువేయ్, శాసన సభ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఓదెల 2లో...
ప్రస్తుతం హెబ్బా పటేల్ తెలుగులో ఓదెల 2 మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తోన్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా ఓదెల 2 తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా నాగసాధువు క్యారెక్టర్‌లో కనిపించబోతుండగా...పల్లెటూరి అమ్మాయి పాత్రను హెబ్బా పటేల్ చేస్తోంది.
టాపిక్