Hebah Patel on Cirkus Movie: సర్కస్ ఈ ఇయర్ వరస్ట్ ఫిల్మ్- రణ్‌వీర్ సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Hebah Patel on Cirkus Movie: రణ్‌వీర్‌సింగ్ సర్కస్ 2022లో వచ్చిన వరస్ట్ సినిమా అని టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరంటే...
Hebah Patel on Cirkus Movie: రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh) , పూజాహెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన బాలీవుడ్ ఫిల్మ్ సర్కస్ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పీరియాడికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. కథలో కొత్తదనం లోపించడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సర్కస్ నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకొంది.
ట్రెండింగ్ వార్తలు
ఫస్ట్ వీక్‌లో కేవలం 30 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. రణ్‌వీర్‌సింగ్ కెరీర్‌లో లోయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ హెభాపటేల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సర్కస్ 2022లో వచ్చిన చెత్త సినిమాగా పేర్కొన్నది. 2022ను ఈ ఇయర్‌లోనే వరస్ట్ ఫిల్మ్‌తో ముగించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసింది. సర్కస్ సినిమాలోని ఓ స్టిల్‌ను పంచుకున్నది. హెభాపటేల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అలా ఎలా, కుమారి 21 ఎఫ్ సినిమాలతో కెరీర్ ఆరంభంలో పెద్ద విజయాల్ని అందుకున్నది హెభాపటేల్. నిఖిల్‌కు జోడీగా నటించిన ఎక్కడకు పోతావు చిన్నవాడా తర్వాత హెభాపటేల్‌కు సరైన విజయం దక్కలేదు.
ప్రస్తుతం తెలుగు ఓ సినిమాతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది హెభాపటేల్. కాగా సర్కస్ సినిమా ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా భారీ అంచనాలతో రిలీజైంది. దాదాపు 150 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. కానీ నెగెటివ్