Bigg Boss Telugu: శోభ వెటకారం.. పద్ధతి మార్చుకోవాలంటూ శివాజీ వార్నింగ్.. టాస్క్ నుంచి ఔట్: వీడియో
Bigg Boss 7 Telugu Day 96 Promo: శివాజీ, శోభా శెట్టి మధ్య బిగ్‍బాస్ హౌస్‍లో గొడవ జరిగింది. శోభ వెటకారంగా మాట్లాడగా.. శివాజీకి కోపం వచ్చింది. ప్రవర్తన మార్చుకోవాలని గట్టిగా చెప్పారు.
Bigg Boss 7 Telugu Day 96 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ముగింపునకు సమీపిస్తున్న కొద్ది హౌస్‍లో హీట్ పెరుగుతోంది. కొందరు కంటెస్టెంట్ల మధ్య గ్యాప్ అధికమవుతోంది. గొడవలు, అరుచుకోవడం ఎక్కువవుతోంది. తాజాగా శివాజీ, శోభా శెట్టి మధ్య మాటల వార్ జరిగింది. నేటి ఎపిసోడ్ (డిసెంబర్ 8) ఇద్దరూ వాదించున్నారు. ఈ ప్రోమో కూడా వచ్చింది. శోభా శెట్టి వెటకారంగా మాట్లాడటంతో శివాజీకి చిర్రెత్తుకొచ్చింది.
శివాజీ, అంబటి అర్జున్, ప్రియాంక గేమ్ ఆడుతుండగా.. సంచాలక్‍గా ఉన్న శోభా శెట్టి డిస్ట్రబ్ చేశారు. ప్రియాంక కాన్‍సన్‍ట్రేట్ అంటూ ఆమెను ఎంకరేజ్ చేశారు. అయితే, ఈ క్రమంలో శివాజీ.. ఏకాగ్రత దెబ్బతినింది. దీంతో ‘నేను ఇంక ఆడనయ్యా’ అంటూ శివాజీ ఆట నుంచి తప్పుకున్నారు. బంతులను పడేసి పక్కకు వెళ్లారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శోభ ఆయన వైపు అలాగే చేశారు.
“ఆ అమ్మాయి ప్రియాంక.. ప్రియాంక అంటే మేం ఏం చేయడానికి ఇక్కడ” అని శివాజీ కోపగించారు. ఆట కొనసాగించాలని యావర్ చెప్పినా ఆయన వినలేదు. నేను ఔట్ అంటూ శివాజీ చెప్పారు. “నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా” అని శోభ అంటే.. సంచాలక్‍గా ఉండి అలా చేస్తావా అని శివాజీ ప్రశ్నించారు. ఎప్పుడైనా ఎవరికైనా సపోర్ట్ చేస్తానని, తన ఇష్టమని శోభ వారించారు. సంచాలక్ అంటే అందరికీ చేయాలని శివాజీ చెప్పారు.
ఐదు నిమిషాల్లో ఎన్ని మాటలు మార్చుకున్నావో చూసుకో అని శివాజీ అంటే.. వెటకారం మొదలుపెట్టారు శోభ. "మీరు కూర్చొని నీళ్లు తాగండి.. అరిచాం కదా ఇద్దరం.. కామ్ అవుతాం” అని శోభ అన్నారు. “కొంచెం మంచిగా అలవాటు చేసుకో. ఆ వెటకారం తగ్గించుకో” అని శివాజీ చిన్న వార్నింగ్‍లా ఇచ్చారు. దీంతో థాంక్యూ సర్ అంటూ తన వెటకారాన్ని శోభ కొనసాగించారు.
మీలా నటించడం లేదని, ఎటు కెమెరాలు ఉన్నాయో చూసి మరీ యాక్టింగ్ చేస్తున్నారనేలా శివాజీని శోభ అన్నారు. దీంతో ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దని, చాలా గొప్పదానివి అంటూ శివాజీ అన్నారు. అయ్యయ్యో, బాబోయ్.. మీరు చాలా పెద్ద అంటూ శోభ అరిచారు. ఈ అయ్యయ్యో, అబ్బొబ్బోలే తెలుస్తాయి తర్వాత అని శివాజీ అన్నారు. 95 రోజుల నుంచి చూస్తున్నాం కదా అని శోభ వారించారు. దీంతో తాను గేమ్ నుంచి రిటైర్డ్ హర్ట్ అని శివాజీ కోపంగా చెప్పారు. ఈ గొడవ మొత్తం నేటి ఎపిసోడ్‍లో రానుంది. ప్రోమో ఇక్కడ చూడండి.
టాపిక్