Etv Win OTT Movies: జూలైలో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - ఈ యాక్షన్ మూవీ హైలైట్
Etv Win OTT Movies: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా హరోంహర, మాధవే మధుసూదన, ఖోఖో తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఇవే...
Etv Win OTT Movies: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలోడిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాల వివరాలను ఈటీవీ విన్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. ఆ సినిమాలు ఏవంటే?

సుధీర్ బాబు హరోంహర...
సుధీర్‌బాబు హీరోగా నటించిన హరోంహర మూవీ ఈ నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. సుధీర్‌బాబు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు.
కుప్పం ప్రాంత నేపథ్యంలో 1980 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హరోంహరలో మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించగా సునీల్ కీలక పాత్ర పోషించాడు. బ్యాక్‌డ్రాప్‌తో పాటు సుధీర్‌బాబు యాక్టింగ్ బాగుందనే పేరొచ్చిన రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఈసినిమా ఫెయిలైంది.
హరోం హర కథ ఇదే...
సుబ్రహ్మణం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గాచేస్తుంటాడు. కుప్పం ఏరియాను గడగడలాడించే తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతడి తమ్ముడు బసవారెడ్డి (రవి కాలె) లతో సుబ్రహ్మణ్యం ఓ విషయంలో గొడవ పడతాడు.ఆ గొడవ కారణంగా సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది.
డబ్బు కోసం గన్ స్మగ్లింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సుబ్రహ్మణ్యం ఓ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? తమ్మిరెడ్డి, బసవరెడ్డిలను ఎదురించి కుప్పం ప్రజలను ఏ విధంగా కాపాడాడు అన్నదే ఈ మూవీ కథ.
మమితా బైజు ఖోఖో...
మమితా బైజు, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఖోఖో మూవీ ఈటీవీ విన్ ద్వారా ఈ నెలలోనే తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించాడు. ఖోఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందింది. ఖోఖో నేషనల్ గేమ్స్‌లో తమ స్కూల్ టీమ్‌ను ఓ మహిళా కోచ్ ఎలా విజేతగా నిలిపింది అన్నదే ఈ మూవీ కథ.
మాధవే మధుసూదన
యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన మాధవే మధూసూదన మూవీ జూలైలో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. తేజ్ బొమ్మదేవర, రిషికి లోక్కే జంటగా నటించిన ఈ మూవీకి బొమ్మదేవర రామచంద్రరావు, దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. గత ఏడాది నవంబర్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ కూడా ఈ నెలలోనే ఈటీవీ ఓటీటీలో విడుదలకాబోతోంది.వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా కీలక పాత్రల్లో నటించారు.
ప్రభాస్ స్పెషల్ పోగ్రామ్...
ఈ సినిమాలతో పాటు ప్రభాస్ తో నా ఉఛ్వాసం కవనం పేరుతో ఈటీవీ ఓ స్పెషల్ పోగ్రామ్‌ను రూపొందింది. ఈ పోగ్రామ్ కూడా ఈ నెలలోనే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ పోగ్రామ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అభిమానులతో పంచుకున్నది.
టాపిక్