Harom Hara OTT Streaming: సుధీర్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా హరోం హర. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. అనూహ్యంగా వాయిదా పడింది. గత గురువారం (జులై 11) ఈ మూవీ ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లోకి రావాల్సి ఉన్నా.. వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ సమయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది.
సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీని ఈరోజు (జులై 15) సాయంత్రం 5 గంటల నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. "యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర మూవీని మిస్ కావద్దు" అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ టైమ్ చెప్పింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహాతోపాటు ఈటీవీ విన్ కూడా సొంతం చేసుకుంది. రెండు ఓటీటీలు జులై 11నే స్ట్రీమింగ్ చేస్తాయని భావించారు. కానీ ఈ మూవీలో చిన్న పాత్ర పోషించిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్, అరెస్ట్ నేపథ్యంలో స్ట్రీమింగ్ వాయిదా వేశారు. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు.
తర్వాత ఈ సినిమాను తాము జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. ఆహా మాత్రం అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు సడెన్ గా మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ అంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండటం విశేషం.
సుబ్రహ్మణం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా కొత్తగా ఉద్యోగంలో చేరుతాడు. కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతడి తమ్ముడు బసవారెడ్డి (రవి కాలె) ఏలుతుంటారు. అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో జరిగిన గొడవ కారణంగా సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది.
డబ్బు కోసం గన్ స్మగ్లింగ్ బిజినెస్‌లోకి సుబ్రహ్మణం అడుగుపెడతాడు. సామాన్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం కుప్పం ఏరియాలో తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? తమ్మిరెడ్డి, బసవరెడ్డిలను ఎదురించి కుప్పం ప్రజలను సుబ్రహ్మణ్యం ఎలా కాపాడాడు అన్నదే ఈ మూవీ కథ.
హరోంహర సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సునీల్, అక్షరా గౌడ ప్రధాన పాత్రలను పోషించారు. కేజీఎఫ్, విక్రమ్, పుష్ప సినిమాల నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. ఆ సినిమాల ఛాయలతోనే సాగడంతో హరోంహరం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.సుధీర్‌బాబు కెరీర్‌లో మరో ఫెయిల్యూర్‌గా నిలిచింది.
హరోం హర చిత్రానికి అంచనాలకు తగట్టు వసూళ్లు రాలేదు. మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. ఈ మూవీకి రూ.7కోట్లలోపే వసూళ్లు వచ్చినట్టు అంచనా.