Haripriya Vasishta simha: కేజీఎఫ్ విలన్‌ను పెళ్లాడబోతున్న బాలకృష్ణ హీరోయిన్
Haripriya Vasishta simha: పిల్లజమీందార్, జైసింహాతో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించింది కన్నడ బ్యూటీ హరిప్రియ. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహాతో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Haripriya Vasishta simha: పిల్ల జమీందార్(Pilla Zamindar )సినిమాలో నాని (Nani) సరసన హీరోయిన్‌గా నటించింది హరిప్రియ. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకున్నది. ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణ (Balakrishna) జైసింహాతో పాటు అమ్మాయి మాస్ అబ్బాయి క్లాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాలు చేసింది.పిల్ల జమీందార్ మినహా టాలీవుడ్‌లో హరిప్రియకు పెద్దగా విజయాలు దక్కలేదు.
ట్రెండింగ్ వార్తలు
కానీ కన్నడంలో బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది హరిప్రియ. త్వరలోనే హరిప్రియ పెళ్లికబురు వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కన్నడ నటుడు వశిష్టసింహాతో (Vasista Simha) ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. కేజీఎఫ్ (KGF) సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు వశిష్ట సింహా. తెలుగులో ఓదెల రైల్వేస్టేషన్, నయీం డైరీస్ సినిమాలు చేశాడు.
ప్రస్తుతం కన్నడంలో వశిష్ట సింహా, హరిప్రియ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే వశిష్టసింహాతో హరిప్రియ ప్రేమలో పడినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం హరిప్రియతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న ఓ వీడియోను వశిష్ట సింహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో హరిప్రియను పార్టనర్ అంటూ పేర్కొన్నాడు. ఎల్లప్పుడూ నీకు మంచే జరగాలి. ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఈ ట్వీట్‌లో వశిష్టసింహా పేర్కొన్నాడు. అతడి ట్వీట్‌కు థాంక్యూ పార్ట్‌నర్ అంటూ హరిప్రియ సమాధానం ఇచ్చింది. హరిప్రియ, వశిష్టసింహా ప్రేమ వార్తలకు ఈ ట్వీట్లు బలాన్ని చేకూర్చాయి.
వచ్చే ఏడాది ఆరంభంలో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనులతో హరిప్రియ, వశిష్టసింహా బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలే దుబాయ్‌లో పెళ్లి షాపింగ్‌ను పూర్తిచేసినట్లు తెలిసింది. త్వరలోనే హరిప్రియ, వశిష్టసింహా తమ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.