HariHara Veera Mallu Release Date: సమ్మర్ నుంచి దసరాకు షిఫ్ట్ అయిన హరిహరవీరమల్లు?
HariHara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు వేసవి బరిలో నుంచి తప్పుకున్నది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
HariHara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను వేసవి కానుకగా మార్చి 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు గతంలో నిర్మాత ఏఎమ్ రత్నం ప్రకటించారు. కానీ వేసవి బరిలో నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
రిలీజ్ డేట్‌ను దసరాకు షిప్ట్ చేసినట్లు సమాచారం. పాలిటిక్స్‌పై దృష్టిసారిస్తూ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవిలో కాకుండా దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
మొఘలుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ మొఘల్ రాజు ఔరంగజేబుగా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాతోనే అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం ఫారిన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. హరిహరవీరమల్లు సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.