Nidhhi Agerwal Complaint To Police Over Threatening: సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్‌లో నిధి అగర్వాల్ పేర్కొంది.
ఈ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు. అలాగే రేప్, గ్యాంగ్ రేప్, లైంగికంగా వేధించడం వంటి క్యాటగిరీలో నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే, 2017లో బాలీవుడ్ మూవీ మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ నిధి అగర్వాల్.
అనంతరం టాలీవుడ్‌కు సవ్యసాచి సినిమాతో పరిచయం అయింది. 2018 సంవత్సరంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి మూవీలో హీరోయిన్‌గా అతనితో జోడీ కట్టింది నిధి అగర్వాల్. అయితే, ఆ సినిమా అంతగా పేరు తీసుకురాలేదు. కానీ, తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్‌గా అలరించింది నిధి అగర్వాల్.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో నిధి అగర్వాల్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత నిధి నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ, ప్రస్తుతం కెరీర్ పరంగా నిధి అగర్వాల్‌కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. నిధి అగర్వాల్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్, ఏపీ డిప్యూటి సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది.
ఈ రెండు చిత్రాలు త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇక హరి హర వీర మల్లు హిస్టారికల్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుండగా.. ప్రభాస్ రాజా సాబ్ హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతోంది. మరి ఈ రెండు సినిమాలు నిధి అగర్వాల్‌కు ఎలాంటి క్రేజ్ తీసుకొస్తాయో చూడాలి.
టాపిక్