పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ ప్రెస్టిజీయెస్ చిత్రం హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్‌గా పవన్ కల్యాణ్ సరసన జోడీ కట్టింది.
తాజాగా మేకర్స్ చెప్పినట్లుగా ఇవాళ (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. రెండు నిమిషాల 56 సెకన్లపాటు ఉన్న హరి హర వీరమల్లు ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. ప్రారంభం నుంచి చివరి వరకు మంచి హై ఇచ్చేలా ఈ ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.
ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించిన తీరు హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అందులోనూ పవన్ కల్యాణ్ వైపుకు వరుసగా బళ్లాలు వస్తుంటే పవర్ స్టార్ తిప్పికొట్టిన ఎపిసోడ్ సూపర్బ్‌గా ఉంది.
హరి హర వీరమల్లు ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పవన్ కల్యాణ్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు మరింత ఇంపాక్ట్ ఇచ్చేలా బీజీఎమ్ ఉంది. మధ్యలో కాస్తా కామెడీ, రొమాంటిక్ ట్రాక్ చూపించారు. విజువల్స్ చాలా రిచ్‌గా బాగున్నాయి. అలాగే, బాబీ డియోల్ విలనిజం కూడా ఆకట్టుకునేలా ఉంది.
ఇక జూలై 24న హరి హర వీరమల్లు థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇవాళ విడుదలైన హరి హర వీరమల్లు ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించడంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్నితాకాయి.
కాగా హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్‌తోపాటు బాలీవుడ్ బ్యూటీస్ నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కూడా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే, సునీల్, సత్యరాజ్, జిషు షేన్‌గుప్తా, దలిప్ తాహిల్, అనసూయ భరద్వాజ్ సైతం ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం