పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు బిగ్ అప్‌డేట్.. ట్రైల‌ర్ వచ్చేది ఆ రోజే-hari hara veera mallu trailer release date announced will be unleashed on july 3rd pawan kalyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు బిగ్ అప్‌డేట్.. ట్రైల‌ర్ వచ్చేది ఆ రోజే

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు బిగ్ అప్‌డేట్.. ట్రైల‌ర్ వచ్చేది ఆ రోజే

విడుదల వాయిదా పడుతూ వస్తున్న పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు.

హరిహర వీరమల్లు పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/Mega Surya Production)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయల కాచేలా చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటికే హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ ను కూడా తీసుకు రాబోతున్నారు. ఫ్యాన్స్ లో హైప్ ను మరింత పెంచేందుకు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఏ రోజు అంటే?

హరిహర వీరమల్లును థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఈ జోష్ ను మరింత పెంచేలా హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. జులై 3న ఉదయం 11.10 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ తో మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘విప్లవం కోసం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. పవర్ ప్యాక్డ్, ఎక్స్ ప్లోజివ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ను జులై 3న ఉదయం 11.10 గంటలకు రిలీజ్ చేస్తున్నాం’’ అని మెగా సూర్య ప్రొడక్షన్ ఎక్స్ లో పోస్టు చేసింది.

భారీ అంచనాలు

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. మేనళ్లుడు సాయి దుర్గ తేజ్ తో కలిసి 2023లో బ్రో చేశారు పవన్. ఆ తర్వాత రాజకీయాలతో బిజీగా అయిపోయారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఓ వైపు పొలిటికల్ పరంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ముందుగా సైన్ చేసిన సినిమాలు ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేశారు.

వాయిదా పడుతూ

హరిహర వీరమల్లు మూవీ నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది మొదట మార్చి 28న, ఆ తర్వాత మే 9న, రీసెంట్ గా జూన్ 12న మూవీ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు జులై 24న పక్కాగా థియేటర్లకు తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం