Hari Hara Veera Mallu Shooting: పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. శరవేగంగా హరి హర వీర మల్లు షూటింగ్-hari hara veera mallu shooting going in a brisk pace at ramoji film city ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hari Hara Veera Mallu Shooting Going In A Brisk Pace At Ramoji Film City

Hari Hara Veera Mallu Shooting: పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. శరవేగంగా హరి హర వీర మల్లు షూటింగ్

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 04:59 PM IST

Hari Hara Veera Mallu Shooting: పవన్‌ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్‌న్యూసే. అతని నెక్ట్స్‌ మూవీ హరి హర వీర మల్లు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ విషయాన్ని మేకర్సే అధికారికంగా ప్రకటించారు.

హరి హర వీర మల్లు మూవీ లొకేషన్ లో పవన్, క్రిష్ తదితరులు
హరి హర వీర మల్లు మూవీ లొకేషన్ లో పవన్, క్రిష్ తదితరులు

Hari Hara Veera Mallu Shooting: కొంతకాలంగా పవన్‌ కల్యాణ్‌ సినిమాల కంటే రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. షూటింగ్‌ స్పాట్‌ల కంటే ఎక్కువగా జనాల మధ్యే ఉంటున్నారు. దీంతో అతడు నటించాల్సిన సినిమాలన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. చాలా రోజుల కిందటే మొదలైన హరి హర వీర మల్లు ప్రాజెక్ట్‌ ఇప్పటికే చాలా ఆలస్యమైంది.

ఇక భవదీయుడు భగత్‌ సింగ్, వినోదయ సీతమ్‌ రీమేక్‌లు అటకెక్కినట్లే. అయితే పవన్‌ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించేలా హరి హర వీర మల్లు షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇందులో పవన్‌ కూడా పాల్గొంటున్నాడు. అతనితోపాటు 900 మంది నటీనటులు, సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నట్లు మేకర్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఇదొక్క మూవీ షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ కావాలని పవన్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో హరి హర వీర మల్లు టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందో చూద్దాం.

"చారిత్రక ప్రాముఖ్యత ఉన్న నాణ్యమైన సినిమా తీయాలంటే చాలా రీసెర్చ్‌, వందల మంది సిబ్బంది శ్రమ అవసరం. ప్రస్తుతం హరి హర వీర మల్లు షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో దీని కోసమే పెద్ద సెట్‌ వేశాము. అక్టోబర్‌ చివరి వారం నుంచి పవన్‌ కల్యాణ్‌తోపాటు 900 మంది ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. ఇదొక మైలురాయి సినిమాగా మిగిలిపోతుందని మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో మీ ప్రేమ, మద్దతు కావాలి" అని మేకర్స్‌ ఆ ప్రకటనలో కోరారు.

క్రిష్‌ డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో హరి హర వీర మల్లు అనే చారిత్రక పాత్రలో పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో అడ్డంకులు, పవన్‌ బిజీ షెడ్యూల్‌తో షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది.

IPL_Entry_Point