పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ రిలీజ్ కు మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే పలు మార్లు మూవీ విడుదల వాయిదా పడింది. రీసెంట్ గా జూన్ 12న థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే.. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడూ అని. రీసెంట్ గా జూన్ 26న ఈ మూవీ రిలీజ్ కాబోతోందని ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ ఆ పోస్టులను నమ్మొద్దని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ కు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలిసింది.
హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రొడ్యూసర్ ఏఎం రత్నం బాగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు అని ఇటీవల డైరెక్టర్ జ్యోతికృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో నిర్మాతపై భారం తగ్గించేలా పవన్ కల్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ రూ.11 కోట్లను చెల్లించేశారు. అంతే కాకుండా మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటానని ప్రొడ్యూసర్ కు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే బిజీ షెడ్యూల్ కారణం పవన్ మూవీ ప్రమోషన్లలో తక్కువగానే కనిపిస్తారు. కానీ ఈ సినిమా కోసం మాత్రం ప్రత్యేకంగా టైమ్ కేటాయించనున్నట్లు టాక్.
మరోవైపు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ చేతిలో ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రైమ్ వీడియో బాగానే చెల్లించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఏడాది మంచి ఓటీటీ విండో టైమ్ లో హరిహర వీరమల్లును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్లే థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రొడ్యూసర్స్ తో డిస్కస్ చేస్తున్నారని సమాచారం.
హిస్టరికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడింది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, వెన్నెల కిశోర్, అనసూయ తదితరులు నటించారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్టర్లు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.
సంబంధిత కథనం