Hari Hara Veera Mallu Power Glance: పవన్ బర్త్‌డే గిఫ్ట్.. పవర్ గ్లాన్స్ అనౌన్స్ చేసిన మేకర్స్
Hari Hara Veera Mallu Power Glance: పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు హరి హర వీర మల్లు మేకర్స్. బుధవారం (ఆగస్ట్ 31) ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.
Hari Hara Veera Mallu Power Glance: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందడి అప్పుడే మొదలైంది. శుక్రవారం (సెప్టెంబర్ 2) పవన్ పుట్టిన రోజు జరుపుకోనుండగా.. అభిమానుల హడావిడి ఓ రేంజ్‌లో ఉంది. ఈ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు హరి హర వీర మల్లు మేకర్స్ ఓ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు. బుధవారం (ఆగస్ట్ 31) వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా చెప్పారు.
అంతేకాదు ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. "స్పెషల్ డే అయిన సెప్టెంబర్ 2 సాయంత్రం 5.45 గంటలకు ఓ గ్రాండ్, అగ్గి పుట్టించే హరి హర వీర మల్లు పవర్ గ్లాన్స్ వస్తోంది. ఈ మాసివ్ బ్లిట్జ్ కోసం సిద్ధంగా ఉండండి" అని మెగా సూర్య ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. పవన్‌కు సంబంధించిన ఓ ఇంటెన్స్ లుక్ పోస్టర్‌ను కూడా ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చారు.
పవన్ కల్యాణ్ బర్త్‌డే నాడు హరి హర వీర మల్లు టీమ్ నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోందని ముందు నుంచే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని చెప్పారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న మూవీ ఇది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి షూటింగ్‌లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం పాటు షూటింగ్ ఆగిపోయింది.
అసలు ఈ సినిమా ముందడుగు వేస్తుందా అన్న సందేహాలు కూడా తలెత్తినా.. చివరికి ఎలాగోలా గాడిన పడింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 30న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ మూవీలో పవన్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నాడు. కోహినూర్ డైమండ్ చోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగా ఈ మూవీలో పవన్ కల్యాణ్ ఓ దొంగ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ మూవీకి మ్యూజిక్ ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది.