ఓటీటీలోకి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు- 300 కోట్ల బడ్జెట్, నెగెటివ్ టాక్- 50 కోట్లకు ఓటీటీ రైట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?-hari hara veera mallu ott rights to amazon prime pawan kalyan harihara veeramallu ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు- 300 కోట్ల బడ్జెట్, నెగెటివ్ టాక్- 50 కోట్లకు ఓటీటీ రైట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు- 300 కోట్ల బడ్జెట్, నెగెటివ్ టాక్- 50 కోట్లకు ఓటీటీ రైట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన హరి హర వీరమల్లు ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. మరి హరి హర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

ఓటీటీలోకి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు- 300 కోట్ల బడ్జెట్, నెగెటివ్ టాక్- 50 కోట్లకు ఓటీటీ రైట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెప్పారు.

ఇద్దరు దర్శకులు

హరి హర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పణలో మూవీని నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పవన్ కల్యాణ్‌కు జోడీ కట్టగా.. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేశాడు.

ప్రీమియర్ షోల నుంచి

జూలై 24న థియేటర్లలో విడుదలైన హరి హర వీరమల్లు సినిమాకు అంతకుముందు రోజు రాత్రి పడిన ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ చాలా బాగుందని, కానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్‌లో సినిమాను అటకెక్కించారని మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి.

దెబ్బ తీసిన గ్రాఫిక్స్

ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బ తీశాయని, ఏమాత్రం బాగోలేని గ్రాఫిక్స్‌ చూపించారని చూసిన ఆడియెన్స్, నెటిజన్స్ ఆన్‌లైన్‌లో ట్వీట్స్ చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం బాగుందని, సినిమాటోగ్రపీ, టేకింగ్ నీరసం తెప్పించాయని ఎక్కువగా విమర్శలు వచ్చాయి.

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే

కానీ, వాటికి విరుద్ధంగా విడుదలైన తొలి రోజున హరి హర వీరమల్లు సినిమాకు రూ. 40 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చి ఆశ్చర్యపరిచింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. ఇక రెండో రోజు అయితే దాదాపుగా 85 శాతం మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి.

బడ్జెట్, ఓటీటీ రైట్స్

ఇలాంటి నెగెటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. సుమారు రూ. 300 కోట్లు పెట్టి తెరకెక్కించిన హరి హర వీరమల్లు ఓటీటీ హక్కులను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 50 కోట్లకు హరిహర వీరమల్లు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయట.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ హరి హర వీరమల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. దీంతో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల తర్వాత హరి హర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని టాక్ నడిచింది.

హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్

కానీ, ప్రస్తుతం సినిమాకు వచ్చే రెస్పాన్స్, కలెక్షన్లను బట్టి ఇంకాస్తా ముందుగానే హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మిక్స్‌డ్ రెస్పాన్స్, తక్కువ కలెక్షన్స్‌తో ప్రదర్శితమవుతున్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం