అక్కడ టికెట్ల బుకింగ్‍ల్లో ‘హరి హర వీరమల్లు’ సూపర్ స్టార్ట్.. జోరు చూపుతున్న పవన్ కల్యాణ్ చిత్రం-hari hara veera mallu movie tickets advance bookings in us started gets strong trend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అక్కడ టికెట్ల బుకింగ్‍ల్లో ‘హరి హర వీరమల్లు’ సూపర్ స్టార్ట్.. జోరు చూపుతున్న పవన్ కల్యాణ్ చిత్రం

అక్కడ టికెట్ల బుకింగ్‍ల్లో ‘హరి హర వీరమల్లు’ సూపర్ స్టార్ట్.. జోరు చూపుతున్న పవన్ కల్యాణ్ చిత్రం

హరి హర వీరమల్లు సినిమా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీమియర్లకు ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. ట్రెండ్ జోరుగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

అక్కడ టికెట్ల బుకింగ్‍ల్లో ‘హరి హర వీరమల్లు’ సూపర్ స్టార్ట్.. జోరు చూపుతున్న పవన్ కల్యాణ్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో హరి హర వీరమల్లు సినిమా ప్రీమియర్ల బుకింగ్స్ అమెరికాలో మొదలయ్యాయి.

అదిరిపోయే స్టార్ట్

హరి హర వీరమల్లు సినిమా ప్రీమియర్ల అడ్వాన్స్ టికెట్ల బుకింగ్‍కు అమెరికాలో సూపర్ క్రేజ్ కనిపిస్తోంది. భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం బుకింగ్‍లకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఒక్క రోజులోనే 3లక్షల డాలర్ల విలువైన టికెట్ అమ్ముడయ్యాయి. ఇంకా జోరు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ప్రీమియర్లకు భారీ కలెక్షన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్‍ను బట్టి చూస్తే పవన్ కెరీర్లో అమెరికాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఈ మూవీ నిలువడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రైలర్ కోసం నిరీక్షణ

హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను జూన్ తొలి వారంలో తీసుకొచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు ఉంటే ఈ సినిమాకు బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ దక్కడం పక్కా అనే అంచనాలు ఉన్నాయి.

హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం, వేరే ప్రాజెక్టులపై దృష్టి సారిచడంతో ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈనెలలోనే ఈ మూవీ కోసం పెండింగ్ షూటింగ్‍ను పవన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

హరి హర వీరమల్లు చిత్రం నుంచి ఇటీవలే మూడో సాంగ్ వచ్చింది. దీనికి ఈవెంట్‍ను కూడా మూవీ టీమ్ నిర్వహింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మొఘలు కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం సాగుతుంది.

ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, సత్యరాజ్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, విక్రమ్‍జీత్ విర్క్, జిస్సు సెంగుప్తా, పూజిత పొన్నాడ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని దాయకర్ రావు, ఏఎం రత్నం ప్రొడ్యూజ్ చేశారు.

ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్‍ చిత్రాలపై ఫోకస్

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా షూటింగ్‍ను కూడా పూర్తి చేసేందుకు కూడా పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందని మూవీ టీమ్ ఇటీవలే ప్రకటించింది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‍లో పవన్ జాయిన్ కానున్నారు. ఇలా పెండింగ్ చిత్రాలను త్వరలో పూర్తి చేయడంపై పవన్ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం