Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - మాట వినాల్సిందే అంటూ పవన్ ఆర్డర్!
హరి హర వీర మల్లు నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మాట వినాలి అంటూ సాగిన ఈ పాటను హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. పెంచలదాస్ రాసిన ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ పాటకు పవన్ కళ్యాణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. మాట వినాలి అంటూ సాగిన ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించాడు. ఈ పాటను పెంచలదాస్ రాశాడు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించాడు.
మన లెక్కలు తెల్వదు...
ఈ పాట ఆరంభంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఏం గురాయించి చూస్తున్నావు. భయపెట్టినీకా? ఓహో చాలా మందిని జూసినాం తన దైన స్టైల్‌లో డైలాగ్స్ చెప్పాడు పవన్. ఏం ముణి మాణిక్యం జూసినవా...గురాయించి చూస్తున్నాడు బిడ్డ. మన లెక్కలు తెల్వదు. వినాలి..వీరమల్లు మాట చెబితే వినాలి అంటూ తెలంగాణ యాసలో పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ పాటకు హైలైట్‌గా నిలుస్తున్నాయి.
అప్పన్న, సుబ్బన్న కొట్టు అంటూ పాట ప్రారంభమైంది. మంచి మాటలను వినడం ద్వారా కలిగే ప్రయోగజనాలు, వాటి నుంచి వచ్చే జ్ఞానాన్ని వివరిస్తూ ఈ పాట సాగింది.
స్పెషల్ అట్రాక్షన్...
జాన పద శైలిలో సాగిన మాట వినాలి పాటకు పవన్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శుక్రవారం రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్‌తో పాటు నాజర్, కబీర్ సింగ్ దుహాన్ కనిపిస్తున్నారు. ఈ పాటలో పవన్ స్టెప్పులు, అతడి లుక్ అభిమానులను అలరిస్తున్నాయి. మాట వినాలి పాట యూట్యూబ్‌తో పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట నిడివి రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు మాత్రమే ఉంది.
పోరాట యోధుడిగా...
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న హరి హర వీరమల్లు మూవీకి ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో మొఘల్ రాజులపై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.
క్రిష్ తప్పుకోవడంతో...
హరిహర వీరమల్లు సినిమాకు తొలుత క్రిష్ దర్శకుడిగా వ్యవహరించాడు. సగానికిపైగా షూటింగ్ పూర్తయిన తర్వాత క్రిష్ హరిహరవీరమల్లు మూవీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సినిమాను పూర్తిచేసే బాధ్యతను జ్యోతికృష్ణ చేపట్టాడు.
బాబీ డియోల్ విలన్...
హరిహరవీరమల్లు స్వార్ట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ తెరకెక్కనున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరో ఎనిమిది రోజుల వరకు బ్యాలెన్స్‌గా మిగిలి ఉన్నట్లు సమాచారం.