మదర్ సెంటిమెంట్‌తో తెలుగు హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఎర్రచీర.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారంటే?-hari hara veera mallu director jyothi krishna wishes to horror action thriller erra cheera the beginning over release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మదర్ సెంటిమెంట్‌తో తెలుగు హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఎర్రచీర.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారంటే?

మదర్ సెంటిమెంట్‌తో తెలుగు హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఎర్రచీర.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారంటే?

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎర్రచీర ది బిగినింగ్. మదర్ సెంటిమెంట్‌ను యాడ్ చేస్తూ రూపొందిన ఎర్రచీరకు సుమన్ బాబు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఎర్రచీర సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.

మదర్ సెంటిమెంట్‌తో తెలుగు హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఎర్రచీర.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారంటే?

తెలుగులో హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఎర్రచీర - ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించింది. ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది.

హారర్ యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్

"ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. హార్రర్, యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచీర బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ఎర్రచీర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఎర్రచీర మూవీని దీపావళి కానుకగా వారం ముందే అంటే అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్

ఎర్రచీర సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్‌గా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు.

"ఎర్రచీర సినిమా విడుదల ఆలస్యం కావచ్చు. కానీ, కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉందని చూసినవారు వెల్లడించారు. హారర్ బ్యాక్ డ్రాప్‌లో మదర్ సెంటిమెంట్‌తో తీసిన ఈ లేడి ఒరియెంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది" అని దర్శకుడు సుమన్ బాబు పేర్కొన్నారు.

ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

"ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్‌కి వచ్చి చూడండి. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నాం. అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం" అని ఎర్రచీర డైరెక్టర్ సుమన్ బాబు వెల్లడించారు.

ఎర్ర చీర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణను కలిసి సినిమా ట్రైలర్‌ను చూపించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుందని, సినిమా అక్టోబర్ 10న విడుదల అవుతోందని, అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలని చెప్పారు.

మంచి విజయం సాధించాలని

ఎర్రచీర సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ఇదిలా ఉంటే, ఎర్రచీర ది బిగినింగ్ సినిమాలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం