Tollywood: రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్-hari hara veera mallu and the raja saab postponement rumors creating confusion for other movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్

Tollywood: రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 22, 2025 04:44 PM IST

Tollywood: హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ చిత్రాలు చెప్పిన తేదీకి వస్తాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. వాయిదా రూమర్లు బలంగా వినిపిస్తున్నా మేకర్స్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఇది కొన్ని ఇతర సినిమాల మేకర్లకు ఇబ్బందిగా మారింది. ఆ వివరాలు ఇవే.

Tollywood: ది రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్
Tollywood: ది రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్

గతేడాది 2024లో భారీ సినిమాలు కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప 2 ముందు చెప్పిన తేదీలకు రిలీజ్ కాలేదు. వాయిదా పడి నెలల పాటు ఆలస్యంగా వచ్చాయి. దీనివల్ల కొన్ని మోస్తరు, చిన్న బడ్జెట్ సినిమాలు చాలా ఇబ్బంది పడ్డాయి. తేదీలు మార్చుకోవాల్సి వచ్చింది. కల్కి, దేవర వాయిదాతో పోయిన వేసవి పెద్ద చిత్రాలు లేకుండానే వేస్ట్ అయింది. ఈ ఏడాది 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలు కన్‍ఫ్యూజన్‍లో పెట్టేశాయి. వాయిదా రూమర్లతో ఇతర సినిమాల మేకర్స్ గందరగోళంలో ఉన్నారు. ఆ వివరాలివే..

yearly horoscope entry point

హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మార్చి 28వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ చిత్రం వాయిదా పడుతుందనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆరోజున వీరమల్లు రిలీజ్ కాదనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ మార్చి 28న రిలీజ్‍కు రెడీ అయింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మార్చి 29న రానున్న అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

హరి హర వీరమల్లు టీమ్ నుంచి వాయిదా గురించి అధికారంగా ప్రకటన రాక ముందే రాబిన్‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి. మరోవైపు, వీరమల్లు షూటింగ్ ఐదు రోజులే మిగిలి ఉందని, మార్చి 28కు సిద్ధమవుతుందనే వాదనలు కూడా ఓవైపు వినిపిస్తున్నాయి. ఇలా రూమర్లతో కన్‍ఫ్యూజన్ నెలకొంటోంది. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తే రాబిన్‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ మేకర్స్ కూడా రిలీజ్ విషయంలో పునరాలోచించే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా హరి హర వీరమల్లు వాయిదా పుకార్లు సందిగ్ధంగా మారాయి. పుకార్లపై ఈ సినిమాను నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ త్వరగా క్లారిటీ ఇస్తే ఇతర చిత్రాల ప్లానింగ్‍కు అనువుగా ఉంటుంది. 

ది రాజా సాబ్

ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లో ఇతర చిత్రాలు వచ్చేందుకు వెనుకడాల్సిన పరిస్థితి ఉంది. అంతలా బాక్సాఫీస్‍పై ఎఫెక్ట్ చూపిస్తారు రెబల్ స్టార్. అయితే, మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సమ్మర్ సీజన్ అయినా ఆ డేట్‍ చుట్టుపక్కల ఎక్కువ తెలుగు చిత్రాలు తేదీలు ఫిక్స్ చేసుకోలేదు. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ ఆ తేదీని లాక్ చేసుకున్నా.. ఆలస్యమవుతుందనే వినిపిస్తోంది. సంక్రాంతికి సందర్భంగా రాజా సాబ్ నుంచి వచ్చిన ప్రభాస్ పోస్టర్‌లో రిలీజ్ డేట్ మిస్ అయింది. దీంతో ఈ సినిమా వాయిదా తథ్యమని అర్థమైంది. ఇక వేరే సినిమాలు ఈ డేట్‍పై గురి పెట్టాలి. రాజా సాబ్ రాకపోతే ఆ స్థానంలో చిరంజీవి ‘విశ్వంభర’ను తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

రాజా సాబ్ మూవీ కోసం జూలై 18వ తేదీని మారుతీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచిస్తుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. దీంతో అప్పటికి ప్లాన్ చేసుకుంటున్న సినిమాల దర్శక నిర్మాతల్లో గుబులు మొదలైంది. ఇలా వాయిదా రూమర్లతో రాజా సాబ్ కూడా కొన్ని సినిమాలను సందిగ్ధంలో పడేస్తోంది. కొత్త రిలీజ్ డేట్‍ను ఆలోచించి మేకర్స్ గట్టిగా ఫిక్స్ చేస్తే ఆ సమయంలో రావాలనుకుంటున్న సినిమాలకు ఓ స్పష్టత ఉంటుంది.

భారీ సినిమాలు ముందుగా ప్లానింగ్ చేసుకోకుండా రిలీజ్‍కు ఏదో ఒక డేట్ చెప్పడం.. ఆ తర్వాత వాయిదా అనడం మూడేళ్లుగా ఎక్కువగా జరుగుతోంది. దీనివల్ల కొన్ని చిన్న, మోస్తరు చిత్రాలకు బాగా ఇబ్బంది కలుగుతోంది. ఇలా కాకుండా పక్కా ప్లానింగ్‍తో పెద్ద చిత్రాలు రిలీజ్ డేట్‍లను ప్రకటిస్తే.. బాగుంటుందనే వాదన ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం