Jr NTR Movies OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి
Jr NTR Top Movies on OTTs: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు (మే 20). ఈ స్పెషల్ డే రోజున ఓటీటీల్లో ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలు చూడాలనుకుంటున్నారా.. అయితే, ఏ ఓటీటీలో.. ఏ చిత్రం ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Jr NTR Top Movies on OTT: మ్యాన్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి దేశంలో ఒకానొక గొప్ప నటుడిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. దిగ్గజం, నటసార్వ భౌముడు సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ తక్కువకాలంలోనే తనదైన గుర్తింపు సాధించారు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు ఎన్టీఆర్. రామాయణంలో మెప్పించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచే రెండేళ్ల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ వరకు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బ్లాక్‍బస్టర్ హిట్‍లు కొట్టారు యంగ్ టైగర్. కొన్నిసార్లు వరుస ప్లాఫ్‍లు పలుకరించినా.. ఆ తర్వాత మళ్లీ అదిపోయే రేంజ్‍లో హిట్‍లు సాధించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‍లో ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన నటనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. 30వ మూవీగా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన నేడు ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు ఓటీటీల్లో చూడాలనుకుంటున్నారా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ఎన్టీఆర్ టాప్ సినిమాలు ఈ ఓటీటీల్లో..
- ఆర్ఆర్ఆర్ (2022) - జీ5 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం), నెట్‍ఫ్లిక్స్ (హిందీ, ఇంగ్లిష్), డిస్నీ+ హాట్‍స్టార్ (తెలుగు)
- అరవింద సమేత (2018) - జీ5, డిస్నీ+ హాట్‍స్టార్
- జై లవకుశ (2017) - సన్‍నెక్స్ట్
- జనతా గ్యారేజ్ (2016) - డిస్నీ+ హాట్‍స్టార్
- నాన్నకు ప్రేమతో (2016) - డిస్నీ+ హాట్‍స్టార్
- టెంపర్ (2015) - సన్‍నెక్స్ట్
- బృందావనం (2010) - సన్‍నెక్స్ట్
- అదుర్స్ (2010) - అమెజాన్ ప్రైమ్ వీడియో
- యమదొంగ (2007) - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్
- రాఖీ (2006) - ఆహా, యూట్యూబ్
- సింహాద్రి (2003) - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్
- ఆది (2002) - సన్ నెక్స్ట్
- స్టూడెంట్ నంబర్ 1 (2001) - యూట్యూబ్
- రామాయణం (1997) - సన్ నెక్స్ట్, యూట్యూబ్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి మూవీ నిన్ను చూడాలని (2001) అంతగా హిట్ కాకపోయినా.. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్‍బస్టర్ అయింది. ఆది సినిమా బంపర్ హిట్ అయింది. ఎన్టీఆర్‌కు తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు ప్లాఫ్‍లు ఎదురైనా రాజమౌళితో చేసిన ‘సింహాద్రి’ సినిమాతో ఎన్టీఆర్ మరో సూపర్ హిట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా వరుస ప్లాఫ్‍లు పలుకరించినా రాఖీ, యమదొంగ చిత్రాలతో బ్లాక్‍బస్టర్లు కొట్టారు. అదుర్స్ సినిమాతో తనలో ఎంత గొప్ప కామెడీ టైమింగ్ ఉందో కూడా ఎన్టీఆర్ నిరూపించుకున్నారు. కెరీర్లో పరాజయాలు ఎదురైన ప్రతీసారి అంతకు మించిన విజయాలను సాధించిన ఎన్టీఆర్.. టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‍కు చేరింది ఎన్టీఆర్ క్రేజ్.
ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్
కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందే ఆదివారమే (మే 19) దేవర నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది. ఇక, వార్ 2 చిత్రంతో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‍తో కలిసి ప్రధాన పాత్ర చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇక, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మరో మూవీ చేయనున్నారు ఎన్టీఆర్.
టాపిక్