Hanuman OTT Release Date: హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై గుడ్ న్యూస్ చెప్పిన జీ5.. సూపర్ హీరో మూవీ ఎప్పుడు రానుందంటే..
Hanuman OTT Release Date: హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై జీ5 ఓటీటీ మొత్తానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వేలాది మంది అభిమానులు మూవీ రిలీజ్ డేట్ గురించి అడుగుతుండటంతో ఆ ఓటీటీ ఓ అధికారిక ప్రకటన చేసింది.

Hanuman OTT Release Date: తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై జీ5 (ZEE5) అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమా త్వరలోనే రాబోతోందంటూ తమ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. నిజానికి గత శుక్రవారం (మార్చి 8) శివరాత్రి సందర్భంగా మూవీ ఓటీటీలోకి వస్తుందని ఎదురు చూసి నిరాశ చెందిన ఫ్యాన్స్.. ఈ ఓటీటీపై దుమ్మెత్తిపోశారు.
హనుమాన్ ఓటీటీ రిలీజ్
ఈ వీకెండ్ లో అయినా హనుమాన్ ఓటీటీలోకి వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ జీ5 గురువారం (మార్చి 14) రాత్రి ఒక ప్రకటన చేసింది. ఈ ఓటీటీ తమ జీ5 గ్లోబల్ (ZEE5 Global) ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ అనౌన్స్ మెంట్ చేసింది. "మీ ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర పడింది. ఈ ఏడాది అల్టిమేట్ సూపర్ హీరో సినిమాపై మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. హనుమాన్ జీ5లోకి త్వరలోనే రాబోతోంది" అని చెప్పింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్లను కూడా ట్యాగ్ చేసింది. గత వారమే ఈ సినిమా జీ5లోకి వస్తుందని భావించినా.. రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచీ దీనిపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆ ఓటీటీ చెబుతూ వచ్చింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కనీసం ఆ విషయం అయినా చెప్పండని అభిమానులు అడుగుతున్నా.. దీనిపై తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవ్వాలని మాత్రం చెప్పింది.
మొత్తానికి వారం తర్వాత దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసింది. ఏ రోజు నుంచి హనుమాన్ వస్తుందో స్పష్టంగా చెప్పకపోయినా.. త్వరలోనే అని మాత్రం వెల్లడించింది. దీంతో హనుమాన్ కోసం మరోసారి ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా.. రెండు నెలలు దాటినా ఓటీటీలోకి రాలేదు.
హనుమాన్ హిందీ వెర్షన్
హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం శనివారం (మార్చి 16) ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఆ రోజు నుంచి హిందీ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. శనివారం రాత్రి 8 గంటలకు హనుమాన్ హిందీ వెర్షన్ కలర్స్ సినీప్లెక్స్ లో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ సినిమా జియోసినిమాలో మాత్రం ఎప్పుడైనా చూడొచ్చు. ఇక తెలుగు వెర్షన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓటీటీ ప్రమోషన్ల పని కూడా తేజ సజ్జ మొదలుపెట్టాడు. హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ కావడంతో అతడు ముంబై వెళ్లాడు. హనుమాన్ సినిమాలో హనుమంతు పాత్రలో తేజ సజ్జా నటించారు. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్, హనుమంతుడిని చూపించిన విధానం అందరినీ మెప్పించాయి.
ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు.
టాపిక్