HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‍పై మళ్లీ బజ్.. ఆరోజున వస్తుందంటూ!-hanuman ott release date buzz again teja sajja prasath varma superhero movie may to stream on zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‍పై మళ్లీ బజ్.. ఆరోజున వస్తుందంటూ!

HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‍పై మళ్లీ బజ్.. ఆరోజున వస్తుందంటూ!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2024 03:01 PM IST

HanuMan OTT Release: హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై ఉత్కంఠ నెలకొంది. గతవారమే వస్తుందని అనుకున్నా.. చివరి సందర్భంలో వాయిదా పడింది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ సూపర్ హీరో చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తోందని అని అందరూ ఎదురుచూస్తున్నారు.

HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‍పై మళ్లీ బజ్.. ఆరోజున వస్తుందంటూ!
HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‍పై మళ్లీ బజ్.. ఆరోజున వస్తుందంటూ!

HanuMan OTT Release: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ చిత్రం భారీ విజయం సాధించింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో బంపర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍‍తో రూపొందిన ఈ మూవీ ఏకంగా సుమారు రూ.350కోట్ల కలెక్షన్లతో సునామీ సృష్టించింది మైథాలజీతో కూడిన ఈ సూపర్ హీరో చిత్రం జనవరి 12న రిలీజ్ కాగా.. అన్నీ చోట్ల అంచనాలను మించి విజయం సాధించింది. అయితే, హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

హనుమాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, మార్చి 8వ తేదీన ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఖరారైనట్టు తెలిసింది. అయితే, సడెన్‍గా ఈ మూవీ స్ట్రీమింగ్‍ను వాయిదా వేసింది జీ5. మార్చి 8న స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. దీంతో చాలా మంది నిరాశచెందారు. అయితే, హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍పై మళ్లీ బజ్ నెలకొంది.

ఆ రోజునే రానుందా?

హనుమాన్ సినిమా మార్చి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందని మళ్లీ బజ్ నెలకొంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, జీ5 నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. మరి, మార్చి 16వ తేదీనైనా ఓటీటీలోకి ఈ చిత్రం వస్తుందేమో చూడాలి.

హిందీ వెర్షన్ కోసమే ఆలస్యమా?

హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మార్చి 16వ తేదీన ఈ మూవీ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. అలాగే, కలర్స్ సినీ ప్లెక్స్ టీవీ ఛానెల్‍లో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానుంది.

అయితే, హిందీ వెర్షన్ కారణంగానే తెలుగు సహా దక్షిణాది భాషల్లో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍ను జీ5లో ఆలస్యం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని భాషల వెర్షన్లను ఒకేసారి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మార్చి 8న జీ5లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదని రూమర్లు వస్తున్నాయి.

మరి, మార్చి 16వ తేదీనైనా హనుమాన్ సినిమా జీ5 ఓటీటీలో అడుగుపెడుతుందో.. మరేమైనా ట్విస్ట్ ఉంటుందో చూడాలి. అయితే, హిందీ వెర్షన్ మాత్రం మార్చి 16న జియోసినిమా ఓటీటీలోకి రానుంది.

హనుమాన్ గురించి..

హనుమాన్ సినిమాలో వీఎఫ్‍ఎక్స్, హనుమంతుడిని చూపించిన తీరు, సూపర్ ఎలిమెంట్స్, టేకింగ్ అంశాల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మపై చాలా ప్రశంసలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి ప్రాజెక్టుగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. హీరో తేజ నటన మెప్పించింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వినయ్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సత్య, రాజ్ దీపర్ శెట్టి, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు.

హనుమాన్ సినిమా ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరహరి అందించిన బ్యాక్‍గ్రౌండ్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్‍గా నిలిచింది. హనుమాన్‍కు సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ సినిమా రానుంది. ఇప్పటికే పనులు మొదలుపెట్టేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.