Vishwambhara First Single: హనుమాన్ జయంతి రోజు రామ పాట.. చిరు స్పెషల్.. విశ్వంభర ఫస్ట్ సింగిల్ ఔట్-hanuman jayanthi special chiranjeevi new movie vishwambhara first single released rama raama song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara First Single: హనుమాన్ జయంతి రోజు రామ పాట.. చిరు స్పెషల్.. విశ్వంభర ఫస్ట్ సింగిల్ ఔట్

Vishwambhara First Single: హనుమాన్ జయంతి రోజు రామ పాట.. చిరు స్పెషల్.. విశ్వంభర ఫస్ట్ సింగిల్ ఔట్

Vishwambhara First Single: హనుమాన్ జయంతి రోజు చిరంజీవి ఫ్యాన్స్ కు ట్రీట్. మెగాస్టార్ కొత్త సినిమా విశ్వంభర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. రామ రామ అంటూ సాగే ఈ పాటలో భక్తిభావంతో చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.

విశ్వంభర మూవీ సాంగ్ లో చిరు డ్యాన్స్ (youtube)

తన ఇష్ట దైవం హనుమాన్ జయంతి రోజున మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సాంగ్ తో ట్రీట్ ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నేడు (ఏప్రిల్12) రిలీజైంది. హనుమాన్ జయంతి స్పెషల్ గా మేకర్స్ రామ రామ అంటూ సాగే ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ వీడియో దూసుకెళ్తోంది.

జై శ్రీరామ్

విశ్వంభర మూవీ నుంచి రిలీజైన రామ రామ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో జై శ్రీరామ్ అంటూ చిరంజీవి చెప్పడం హైలైట్ గా నిలిచింది. రామ రామ అంటూ సాగే ఈ పాటలో చిరు స్టెప్స్ గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. రాముని గొప్పతనాన్ని.. హనుమంతుని భక్తిని చాటుతూ సాంగ్ ఉంది. చిరంజీవి వయసు చాలా తగ్గినట్లు కనిపిస్తున్న లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

‘‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా ఇష్ట దైవం పుట్టిన రోజున,తన ఇష్ట దైవం గురించి పాట’’ అని ఎక్స్ లో చిరంజీవి పేర్కొన్నారు.

కలర్ ఫుల్ గా

రామ రామ సాంగ్ ను కలర్ ఫుల్ గా షూట్ చేసినట్లు కనిపిస్తోంది. లోకేషన్స్ అన్నీ అందంగా ఉన్నాయి. ట్రెడిషనల్ లుక్ లో చిరంజీవి అదరగొట్టారు. ఈ పాటను ప్రముఖ సింగర్ శంకర్ మహాదేవన్, లిప్సిక ఆలపించారు. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవన్ గొంతు నుంచి వచ్చిన ఈ పాట డివోషనల్ గా సాగుతోంది. అంతే కాకుండా మెలోడియస్ గానూ ఉంది.

చిరంజీవి కొత్త సినిమా విశ్వంభరకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఈ రామ రామ సాంగ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ మూవీకి వశిష్ఠ డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ క్రిష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా సిద్ధమవుతున్న విశ్వంభరలో చిరంజీవి, త్రిష, అషిక రంగనాథన్, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన విశ్వంభర టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. చీకటిపై వెలుగు పోరాటంగా ఈ మూవీ సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫ్యాన్స్ ను మరో లోకంలోకి తీసుకెళ్లడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం