Teja Sajja Next Movie: తేజ సజ్జా తదుపరి సినిమా టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఖరారు: వివరాలివే..
Teja Sajja Next Movie - Super Yodha: హనుమాన్ హీరో తేజ సజ్జా తదుపరి సినిమా గురించి అప్‍డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్‍కు తేదీ ఖరారైంది. ఫస్ట్ లుక్ కూడా రానుంది. ఆ వివరాలివే..
Teja Sajja - Super Yodha: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హనుమాన్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సాధించారు. పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ఏకంగా రూ.300కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ హిట్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‍గా జైహనుమాన్ కూడా రూపొందనుంది. అయితే, తేజ సజ్జా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈగల్ మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.
టైటిల్ గ్లింప్స్ డేట్ ఇదే..
తేజ సజ్జా - డైరెక్టర్ కార్తీక్ ఘట్టమమేని కాంబినేషన్‍లో మూవీని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఫస్ట్ లుక్ కూడా ఇదేరోజు రానుంది. ఈ విషయాన్ని నేడు (ఏప్రిల్ 15) ప్రకటించింది ఆ నిర్మాణ సంస్థ.
సూపర్ హీరో తేజ సజ్జాతో ప్రతిష్టాత్మక చిత్రం కోసం చేతులు కలుపుతున్నందుకు సంతోషంగా ఉందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ‘సూపర్ యోధ అడ్వెంచరస్ సాగా’ అంటూ తేజ సజ్జా ఉన్న పోస్టర్ పోస్ట్ చేసింది.
ఈ చిత్రంలో విలన్‍గా మంచు విష్ణు నటించనున్నారని తెలుస్తోంది. స్టార్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై చాలా ఆసక్తి నెలకొని ఉంది.
సూపర్ యోధగా..
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంలో తేజ సజ్జా.. ‘సూపర్ యోధ’ (Super Yodha) పాత్ర చేయనున్నారని తెలుస్తోంది. సూపర్ యోధ అనే హ్యాష్ ట్యాగ్‍ను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పోస్ట్ చేసింది. అయితే, ఈ సినిమాకు ఇదే టైటిల్ ఉంటుందా.. వేరేది ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి. ఏప్రిల్ 18న ఈ విషయం తేలనుంది.
ఏప్రిల్ 18న సూపర్ యోధా ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేస్తామంటూ తేజ సజ్జా కూడా నేడు ట్వీట్ చేశారు. అడ్వెంచరస్‍గా, సర్‌ప్రైజ్‍లతో ఈ గ్లింప్స్ ఉండనుందని తెలిపారు. తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమనేని కాంబోలో రానున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో తెరకెక్కనుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌కు ఇది 36వ మూవీగా ఉంది.
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రం ఈ ఏడాది జవనరిలో రిలీజై భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సూపర్ హీరో చిత్రానికి ఏకంగా సుమారు రూ.330 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ పనుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోనూ తేజ సజ్జా కనిపించనున్నారు. అయితే, హనుమంతుడిగా ప్రధాన పాత్ర వేరే హీరో చేసే అవకాశం ఉంటుందని ప్రశాంత్ వర్మ హింట్లు ఇచ్చారు.
టాపిక్