My Name is Shruthi OTT: ఓటీటీలోకి హన్సిక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ - రేపటినుంచే స్ట్రీమింగ్!
My Name is Shruthi OTT: హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
My Name is Shruthi OTT: హన్సిక హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీలోకి రాబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 28) నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమంగ్ అవుతోంది. తాజాగా ఆహా ఓటీటీలోకి కూడా హన్సిక మూవీ రాబోతోంది. మై నేమ్ ఈజ్ శృతి మూవీతో శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్కిన్ మాఫియా అనే కొత్త పాయింట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి...
నవంబర్ 17న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అదే రోజు పోటీగా పలు సినిమాలు విడుదల కావడం మై నేమ్ ఈజ్ శృతి కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల గ్యాప్ తర్వాత మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీలోకి వచ్చేస్తోంది. సందీప్‌కిషన్ హీరోగా 2019లో రూపొందిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది హన్సిక. మై నేమ్ ఈజ్ శృతి మూవీతోనే దాదాపు నాలుగేళ్ల విరామం తిరిగి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మై నేమ్ ఈజ్ శృతి కథ...
శృతి (హన్సిక) ఓ యాడ్ ఎజెన్సీలో పనిచేస్తుంది. చరణ్ అనే అబ్బాయిని పెళ్లిచేసుకొని జీవితంలో స్థిరపడాలని కలలు కంటుంది. శృతి ఫ్లాట్‌లో అను (పూజా రామచంద్రన్) అనే అమ్మాయి డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆ సంఘటనతో సంతోషంగా సాగిపోతున్న శృతి జీవితం ఒక్కసారిగా తలక్రిందులవుతుంది.
అను మర్డర్ కేసులో అరెస్టైన శృతిని చంపడానికి ఎమ్మెల్యే గురుమూర్తి (ఆడుకాలం నరేన్) మనుషులు ప్రయత్నిస్తుంటారు. శృతిని ఎమ్మెల్యే టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? శృతిని నిజంగానే చరణ్ ప్రేమించాడా? చరణ్ నిజ స్వరూపం ఎలా బయటపడింది. స్కిన్ మాఫియా గుట్టును బయటపెట్టడానికి శృతి ఎలాంటి పోరాటం సాగించింది.
స్కిన్ ట్రేడింగ్ గ్యాంగ్‌తో డాక్టర్ కిరణ్మయి (ప్రేమ), మినిస్టర్ ప్రతాప్ రెడ్డి( రాజా రవీంద్ర)తో పాటు శృతి బావ బాబీ(ప్రవీణ్)లకు ఎలాంటి సంబంధం ఉంది? అను మర్డర్ కేసు మిస్టరీని శృతి సహాయంతో ఏసీపీ రంజిత్ (మురళీ శర్మ) ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ సినిమా కథ.
హన్సిక యాక్టింగ్ బాగున్నా...
ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో హన్సిక యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ బాగుందనే పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సినిమా వర్కవుట్ కాలేదు.మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.
హన్సిక నాలుగు సినిమాలు...
మై నేమ్ ఈజ్ శృతి తర్వాత తెలుగులో 105 మినిట్స్ పేరుతో ఓ సినిమా చేసింది హన్సిక. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ మూవీ కూడా హన్సికకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్‌తో పాటు మ్యాన్ అనే సినిమా చేస్తోంది హన్సిక. 2022 డిసెంబర్‌లో తన చిరకాల ప్రియుడు సోహైల్ కథురియాను పెళ్లాడింది హన్సిక. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తోంది హన్సిక.