Guardian OTT: హన్సిక హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సింప్లీసౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే సింప్లీసౌత్ ఓటీటీలో ఈ హారర్ మూవీని చూడొచ్చు.
ఇండియన్ ఆడియెన్స్ గార్డియన్ మూవీని చూడాలంటే మరో వారం వెయిట్ చెయక తప్పదని సమాచారం. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గార్డియన్ మూవీకి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లోనే థియేటర్లలో కనిపించకుండాపోయింది.
హన్సిక యాక్టింగ్ మినహా కథ, కథనాలు, హారర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ బాగాలేదంటూ విమర్శలొచ్చాయి. 2022లోనే ఈ సినిమా మొదలైంది. షూటింగ్ డిలే కావడం, ఇతర కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయిన రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.
రొటీన్ హారర్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు శబరి గురుశరవణన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే ఈ మూవీ కథ.
గత కొన్నాళ్లుగా సక్సెస్ రేసులో వెనుకబడిపోయింది హన్సిక. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తోన్న అవేవీ ఆమెకు విజయాల్ని తెచ్చిపెట్టడం లేదు. గత ఏడాది తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి, తమిళంలో పార్ట్‌నర్ సినిమాలు చేసింది. కాన్సెప్ట్‌లు కొత్తగా ఉన్నా.... పూర్ మేకింగ్, టేకింగ్ కారణంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఈ ఏడాది సింగిల్ క్యారెక్టర్‌తో తెలుగులో 105 మినిట్స్ అనే సినిమా చేసింది హన్సిక. ఈ ప్రయోగం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.తెలుగు, తమిళ భాషల్లో ఓ కమర్షియల్ సక్సెస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు హన్సిక ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది హన్సిక. 2022 డిసెంబర్‌లో తన ప్రియుడు, బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను పెళ్లాడింది హన్సిక. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే సినిమాలపై ఫోకస్ పెడుతోంది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో హన్సిక నటిస్తోంది. నషా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. మైత్రీ తర్వాత హన్సిక లీడ్ రోల్‌లో నటిస్తోన్న సెకండ్ వెబ్ సిరీస్ ఇది.