105 Minutes OTT: ఓటీటీలోకి హన్సిక సింగిల్ క్యారెక్టర్ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
105 Minutes OTT: హన్సిక హీరోయిన్‌గా నటించిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 105 మినిట్స్ మరో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
105 Minutes OTT: సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక ప్రయోగాత్మకంగా చేసిన 105 మినిట్స్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 7 నుంచి ఆహా ఓటీటీలో ఈ సింగిల్ క్యారెక్టర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. 105 మినిట్స్ స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో కూడా...
105 మినిట్స్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రెంటల్ విధానంలో ఈ ఓటీటీలో మూవీ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో హన్సిక మూవీ చూడాలంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 79 రూపాయలు చెల్లించాల్సిఉంది. ఆహా ఓటీటీలో మాత్రం ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
సింగిల్ క్యారెక్టర్ మూవీ...
సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సింగిల్ క్యారెక్టర్ మూవీకి రాజు దుస్సా దర్శకత్వం వహించాడు. జనవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 105 మినిట్స్ సినిమా మొత్తం హన్సిక క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. గంట నలభై ఐదు నిమిషాలు ఆమె తప్ప మరో క్యారెక్టర్ స్క్రీన్‌పై కనిపించకుండా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
105 మినిట్స్ కథ ఇదే...
జాను (హన్సిక) అనుకోని పరిస్థితుల్లో ఓ అదృశ్య శక్తి కారణంగా తన ఇంట్లోనే బందీగా మారుతుంది. జానును చంపాలని ఆ అదృశ్య శక్తి ప్రయత్నిస్తుంది? జానుపై ఆ శక్తి పగ పట్టడానికి కారణం ఏమిటి? ఆ అదృశ్య శక్తి బారి నుంచి జాను తప్పించుకుందా? లేదా అన్నదే ఈ మూవీ కథ. హన్సిక యాక్టింగ్ బాగుందనే పేరొచ్చిన కాన్సెప్ట్ మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరగడం, రిపీటెడ్ సీన్స్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గంట నలభై ఐదు నిమిషాలే ఈ సినిమా లెంగ్త్ అయినా అదే మైనస్‌గా మారింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీ...
మై నేమ్ ఈజ్ శృతితో గత ఏడాది నవంబర్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హన్సిక. థ్రిల్లర్ కథాంశంతో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. తెలుగుతో పాటు తమిళంలో హన్సిక హిట్టు అనే మాట విని చాలా కాలమైంది.
బ్లాక్‌బస్టర్‌తో కమ్ బ్యాక్ ఇవ్వాలని రెండు, మూడేళ్లుగా ఎదురుచూస్తోంది. తమిళంలో రౌడీ బేబీతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది హన్సిక. ఈ సినిమాలపైనే హన్సిక ఆశలు పెట్టుకున్నది. మైత్రీ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేసినా అది ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. 2022లో ప్రియుడు సోహైల్ కథురియాను పెళ్లాడింది హన్సిక. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే సినిమాలు చేస్తోంది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి కాగా...హన్సిక మొదటి వివాహం కావడం విశేషం.
దేశముదురుతో ఎంట్రీ…
దేశముదురు తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నది. ఆ తర్వాత కందిరీగ, దేనికైనా రెడీతో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరింది. కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కావడం, కథల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ను దెబ్బతీశాయి.