Hansika: హన్సిక లేడి ఒరియెంటెడ్ మూవీ.. ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి-hansika motwani my name is shruthi movie poratam poratam lyrical video release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika: హన్సిక లేడి ఒరియెంటెడ్ మూవీ.. ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి

Hansika: హన్సిక లేడి ఒరియెంటెడ్ మూవీ.. ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి

Sanjiv Kumar HT Telugu
Sep 29, 2023 04:51 PM IST

My Name Is Shruthi Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హన్సిక వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మరో సరికొత్త మూవీ మై నేమ్ ఈజ్ శృతితో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

హన్సిక లేడి ఒరియెంటెడ్ మూవీ.. ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి
హన్సిక లేడి ఒరియెంటెడ్ మూవీ.. ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె తాజాగా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించగా.. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు.

yearly horoscope entry point

తాజాగా మై నేమ్ ఈజ్ శృతి మూవీ నుంచి 'పోరాటం పోరాటం' అనే లిరికల్ వీడియోను (My Name Is Shruthi Lyrical Video) విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ పాల్గొంది. "కష్ణకాంత్ రచించిన ఈ పాటకు మార్కె కె రాబిన్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. ఇప్పటి వరకు రానటువంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది" అని డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు.

"సినిమాలో ఉండే ట్విస్ట్ లు అందరిని కట్టిపడేస్తాయి. చివరి వరకు ఎవరి ఊహకందని కథాంశమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది" అని దర్శకుడు చెప్పుకొచ్చారు. తర్వాత "శృతి అనే యువ‌తిగా ఈ సినిమాలో క‌నిపిస్తా. త‌న భావాల్ని ధైర్యంగా వెల్ల‌డించే యువ‌తిగా విభిన్నంగా నా పాత్ర‌ ఉంటుంది. ఆద్యంతం మ‌లుపుల‌తో ఆస‌క్తికరంగా సినిమా సాగుతుంది. క‌థ వింటున్న‌ప్పుడు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ముంగింపు వ‌ర‌కు నేను ఊహించ‌లేక‌పోయాను" అని హన్సిక పేర్కొంది.

మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, ఆర్ నారాయణన్, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, రాజీవ్ క‌న‌కాల ఇతర ముఖ్యపాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కిశోర్ బోయిడ‌పు సినిమాటోగ్ర‌ఫీ, మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. చోటా.కె.ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Whats_app_banner