Kalvan OTT: ఓటీటీలోకి లవ్ టుడే హీరోయిన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Kalvan OTT: జీవీ ప్రకాష్ కుమార్, ఇవానా జంటగా నటించిన తమిళ మూవీ కాల్వన్ మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీలో తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
Kalvan OTT: రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. నాలుగు నెలల గ్యాప్‌లోనే అతడు హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కాల్వన్ ఒకటి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్...
మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాల్వన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కాల్వన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది.
లవ్ టుడే ఫేమ్...
కాల్వన్ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కీలక పాత్ర పోషించాడు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ
ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్, భారతీరాజా యాక్టింగ్ బాగుందనే పేరొచ్చిన కథలో సరిగ్గా ఎమోషన్స్ లేకపోవడం, డ్రామాను పండించడంలో దర్శకుడు విఫలం కావడంలో ఫెయిల్యూర్‌గా నిలిచింది. కాల్వన్ సినిమాకు పీవీ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా జీవీ ప్రకాష్ కుమార్ వ్యవహరించాడు. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో కోటిలోపే వసూళ్లను రాబట్టింది.
కాల్వన్ కథ ఇదే...
కెంబన్ (జీవీ ప్రకాష్ కుమార్), సూరి (దీన) అనాథలు. దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. బాలమణిని (ఇవానా)ప్రేమిస్తుంటాడు కెంబన్. ఆమె ప్రేమ కోసం దొంగతనాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వం ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో ఉంటాయి. వారు ఉంటోన్న ఊరిపై ఓ ఎనుగు తరచుగా ఎటాక్ చేస్తుంటుంది. ఆ ఎనుగును పట్టుకుంటే ప్రభుత్వం ఉద్యోగంతో పాటు పారితోషికంగా డబ్బును కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ ఎనుగును కెంబన్, సూరి ఎలా పట్టుకున్నారు? ఈ ప్రయత్నంలో వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అన్నదే కాల్వన్ మూవీ కథ.
రెబెల్...డియర్..
ఈ ఏడాది జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా కాల్వన్‌తో పాటు రెబెల్, డియర్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సామాజిక ఇతివృత్తాలకు కమర్షియల్ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమాలేవి సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయాయి. రెబెల్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోండగా...డియర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూడు సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం హీరోగా మరో రెండు తమిళ సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్రకాష్ కుమార్.
నితిన్ రాబిన్‌హుడ్...
హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. ఏకంగా పదకొండు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. వాటిలో తెలుగు సినిమాలు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, నితిన్ రాబిన్ హుడ్ కూడా ఉన్నాయి. అలాగే విక్రమ్ తాంగలన్, దానవీర శూరన్‌తో పాటు అమరన్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాలతో మ్యూజిక్‌ను సమకూర్చుతున్నాడు జీవీ ప్రకాష్ కుమార్.