GV Prakash Kumar About Kingston And Hollywood Reaction: తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్. తొలి భారతీయ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తోన్న కింగ్‌స్టన్ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా దివ్యభారతి నటించింది.
మార్చి 7న తమిళంతోపాటు తెలుగులో కూడా కింగ్‌స్టన్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జీవీ ప్రకాష్ కుమార్ తెలుగు మీడియాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతోపాటు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
అవును. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు తడి తడిగా ఉంటుంది కనుక జారిపోయేది. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ల మీద గాయాలు అయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని. అయితే యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగా వచ్చాయి.
ఇండియాలో ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా మూడు రోజుల పాటు టెస్ట్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత గోకుల్ బినోయ్ సినిమా మొత్తం చేశారు. ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉంటే మరొక బోటు మీద కెమెరా ఉండేది. అలాగే కొన్ని మీనియేచర్ సెట్స్ కూడా వేశాం. సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతుంది. వీళ్లు ఈ సినిమా ఎలా చేశారని తప్పకుండా అడుగుతారు.
జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది. మంచి కాంబినేషన్ అయితే బాగుంటుందని జీ స్టూడియోస్ సంస్థ కూడా దివ్యభారతి పేరు సజస్ట్ చేశారు. సినిమాలో ఆ అమ్మాయి యాక్షన్ సీక్వెన్స్ చేసింది. కింగ్‌స్టన్ తర్వాత ఆమెకు మంచి పేరు వస్తుంది.
చాలా ఉంటుందండి. అందుకు ప్రాబ్లం ఏమీ లేదు. షూటింగ్ లేని టైంలో ఉదయం 9 గంటలకు నిద్ర లేస్తా. వర్కౌట్స్ అవి చేసుకుని మ్యూజిక్ పనులు మొదలుపెడతా. షూటింగ్ ఉంటే ఎర్లీగా నిద్ర లేస్తా.
'బాహుబలి' ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అలాగే 'కాంతార' సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్‌లోకి తీసుకు వెళ్లింది. మా 'కింగ్‌స్టన్' సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంది. హాలీవుడ్ దర్శక నిర్మాతలు వాళ్ల కథలను చెబుతున్నారు. మేం 'కింగ్‌స్టన్' ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకు వస్తున్నాం.
సంబంధిత కథనం